E-Paper
Advertisement

Back Pain: వెన్నునొప్పి ఈ 5 లక్షణాలతో కలిసి వస్తుందా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి !

Back Pain: వెన్నునొప్పి ఈ 5 లక్షణాలతో కలిసి వస్తుందా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి !
Advertisement

Back Pain: నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో.. ప్రతి పది మందిలో ఎనిమిది మందిని వేధించే సాధారణ సమస్య. కూర్చునే పద్ధతి సరిగ్గా లేకపోవడం.. శారీరక శ్రమ తగ్గడం లేదా బరువులు ఎత్తడం వల్ల వచ్చే నడుము నొప్పిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే అన్ని రకాల నడుము నొప్పులు సామాన్యమైనవి కావు. కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి శరీరంలో దాగి ఉన్న ప్రాణాంతక వ్యాధులకు లేదా తీవ్రమైన నరాల సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ నొప్పి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో.. ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

నడుము నొప్పి ఎప్పుడు ప్రాణాంతకమవుతుంది ?

నడుము నొప్పితో పాటు ఈ కింది లక్షణాలు కనిపిస్తే.. దానిని మెడికల్ ఎమర్జెన్సీగా భావించి వెంటనే డాక్టరును సంప్రదించాలి.

Advertisement

1. కౌడా ఈక్వినా సిండ్రోమ్ :

ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. వెన్నెముక దిగువ భాగంలో ఉండే నరాల కట్ట తీవ్రంగా ఒత్తిడికి గురైనప్పుడు ఇది సంభవిస్తుంది. దీని వల్ల కాళ్లు పక్షవాతానికి గురికావడమే కాకుండా.. యూరిన్, మల విసర్జనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. దీనికి వెంటనే.. శస్త్రచికిత్స చేయకపోతే శాశ్వత వైకల్యం సంభవించవచ్చు.

2. ఇన్ఫెక్షన్లు:

నడుము నొప్పితో పాటు తీవ్రమైన జ్వరం, వణుకు ఉంటే అది వెన్నెముకలో ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. దీనిని ‘డిస్సిటిస్’ లేదా ‘ఆస్టియోమైలిటిస్’ అంటారు. ఇది రక్తంలోకి వ్యాపిస్తే ప్రాణాపాయం కలగవచ్చు.

3. వెన్నెముక క్యాన్సర్:

కొన్నిసార్లు శరీరంలోని ఇతర భాగాల్లో (ఊపిరితిత్తులు లేదా రొమ్ము) ఉన్న క్యాన్సర్ వెన్నెముకకు పాకుతుంది. రాత్రి పూట నొప్పి విపరీతంగా ఉండటం.. కారణం లేకుండా బరువు తగ్గడం వంటివి కనిపిస్తే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు.

4. అబ్డామినల్ అయోర్టిక్ అనీరిజం:

మన శరీరంలోని అతిపెద్ద ధమని బలహీనపడి ఉబ్బినప్పుడు.. అది నడుము నొప్పిని కలిగిస్తుంది. ఇది గనక పగిలితే అంతర్గత రక్తస్రావం జరిగి నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

ప్రమాదకరమైన సంకేతాలు:

ఈ క్రింది లక్షణాలు ఉంటే.. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

నొప్పితో పాటు జ్వరం: ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుంది.

కాళ్లలో బలహీనత: నడుము నొప్పి కాళ్ల వరకు పాకడం లేదా కాళ్లు మొద్దుబారిపోవడం.

మూత్ర నియంత్రణ లేకపోవడం: మూత్రం ఆపుకోలేకపోవడం లేదా మూత్రం రాకపోవడం.

అకస్మాత్తుగా బరువు తగ్గడం: క్యాన్సర్ లేదా ఇతర తీవ్ర వ్యాధులకు సంకేతం.

దెబ్బ తగిలిన తర్వాత నొప్పి: ప్రమాదం లేదా కింద పడటం వల్ల వచ్చే నొప్పి వెన్నెముక ఫ్రాక్చర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

నివారణ, జాగ్రత్తలు:

సరైన భంగిమ: కూర్చునేటప్పుడు వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం: వెన్ను కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి.

బరువు నియంత్రణ: అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని పెంచుతుంది.

వైద్య పరీక్షలు: నొప్పి వారం కంటే ఎక్కువ కాలం ఉన్నా.. పైన చెప్పిన లక్షణాలు కనిపించినా.. వెంటనే ఎంఆర్ఐ లేదా ఎక్స్-రే చేయించుకోవాలి.

నడుము నొప్పిని కేవలం పెయిన్ కిల్లర్లతో నయం చేయాలని చూడటం ప్రమాదకరం. నొప్పి వెనక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడం ముఖ్యం.

Related News

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

Big Stories

Advertisement
×