E-Paper
Advertisement

చిన్నారుల కోసం ఈ బేబీ ప్రొడక్ట్స్ కొనకూడదు.. తల్లిదండ్రులకు డాక్టర్ల హెచ్చరిక

చిన్నారుల కోసం ఈ బేబీ ప్రొడక్ట్స్ కొనకూడదు.. తల్లిదండ్రులకు డాక్టర్ల హెచ్చరిక
Advertisement

ఇంట్లో బిడ్డపుట్టిన తరువాత తల్లిదండ్రులు ఆ చిన్నారి కోసం ఎన్నో వస్తువులు కొనాలని అనుకుంటారు. టీవీల్లో చూపించే ప్రకటనలు కూడా చాలా వస్తువులను తప్పనిసరిగా అవసరమని చూపిస్తాయి. కానీ అన్ని వస్తువులు నిజంగా ఉపయోగపడవు. కొన్ని వస్తువులు డబ్బు వృథా చేయడమే కాకుండా బిడ్డ ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. ప్రముఖ శిశు వైద్యుడు డాక్టర్ రవి మాలిక్ ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చారు.

టాల్కమ్ పౌడర్ ఉపయోగించకండి

చిన్నపిల్లలకు టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం మంచిది కాదు. పౌడర్‌లోని చిన్న కణాలు బిడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో శ్వాస సమస్యలు, అలర్జీలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే వైద్యులు టాల్కమ్ పౌడర్‌ను చిన్నపిల్లలకు పూర్తిగా దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

బేబీ మిట్టెన్స్ అవసరం లేదు

Advertisement

చిన్నపిల్లల చేతులకు మిట్టెన్స్ (గ్లవ్స్) వేయడం అవసరం లేదు. ఇవి పిల్లల వేళ్ల కదలికలను అడ్డుకుంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచే చేతులతో వస్తువులను తెలుసుకోవడం ప్రారంభిస్తారు. మిట్టెన్స్ వల్ల చేతుల్లో చెమట పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు కూడా రావచ్చు. పిల్లల చేతులు స్వేచ్ఛగా ఉండటం మంచిది.

గ్రైప్ వాటర్ తరచుగా ఇవ్వకండి

చాలామంది పిల్లలకు కడుపు నొప్పి తగ్గుతుందని గ్రైప్ వాటర్ తాగిస్తారు. కానీ ఇది ప్రతి సందర్భంలో అవసరం కాదు. గ్రైప్ వాటర్‌లో అవసరం లేని పదార్థాలు ఉంటాయి. సరైన పద్ధతిలో పాలిచ్చడం, బర్పింగ్ (తేపులు) చేయించడం మంచిది. సాధారణ జాగ్రత్తలతో చాలా సమస్యలు తగ్గిపోతాయి.

బేబీ వాకర్స్ వాడకండి

Advertisement

బేబీ వాకర్స్ పిల్లలకు ప్రమాదకరంగా మారవచ్చు. వీటి వల్ల పడిపోవడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా నడవడం నేర్చుకునే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. వాకర్స్ వల్ల కాళ్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలు నేలపై మొకాళ్లపై పాకుతూ ఉండడం మంచిది. దీంతో శరీర సమతుల్యత బాగా అభివృద్ధి చెందుతుంది. కెనడా లాంటి దేశాల్లో వాకర్స్ పై ప్రభుత్వం నిషేధం విధించింది.

ప్యాక్డ్ బేబీ ఫుడ్స్ తగ్గించండి

చిన్న వయసులోనే మార్కెట్‌లో లభించే ప్యాక్డ్ బేబీ ఫుడ్స్ ఇవ్వడం మంచిది కాదు. వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండొచ్చు. దీంతో జీర్ణ సమస్యలు, అలర్జీలు రావచ్చు. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారం ఆరోగ్యానికి మంచిది. సరైన వయసులో పండ్లు, కూరగాయలు కొద్దిగా తినిపించడం అలవాటు చేయాలి.

నేలపై పాకే పిల్లలకు షూస్ అవసరం లేదు

మొకాళ్లు, చేతులు ఉపయోగించి పాకుతూ నడక ప్రారంభించే పిల్లలకు షూస్ ధరించడం మంచిది కాదు. పాదాలు నేలను నేరుగా తాకడం అవసరం. దీంతో పాదాల కండరాలు బలంగా తయారవుతాయి. షూస్ వల్ల చెమట, చర్మ సమస్యలు రావచ్చు. షూస్ బదులు ఇంట్లో మృదువైన సాక్స్ ఉండే ఉపయోగించవచ్చు.

Also Read: కిచెన్‌లో వంట చేసే సమయంలో మండిపోతోందా? ఈ టిప్స్‌తో వేడికి చెక్

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఏ వస్తువు కొనుగోలు చేసే ముందు లేబుల్ చదవాలి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అత్యవసరమైన వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రేమ, సరైన ఆహారం, శుభ్రత పిల్లలకు అత్యంత అవసరం. అనవసర వస్తువుల కంటే భద్రత ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

తొలిసారి తల్లిదండ్రులు అయిన దంపతులు ప్రకటనలకు ఆకర్షితులు కాకూడదు. అన్ని బేబీ ప్రొడక్ట్స్‌తో ఉపయోగకరం కావు. సరైన సమాచారం తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది. పిల్లల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణ జాగ్రత్తలు, ప్రేమతో పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×