E-Paper
Advertisement

Oil for Hair: నూనె రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది ఎంతవరకు నిజం? శాస్త్రీయ ఆధారాలతో సమాధానం ఇదిగో..

Oil for Hair: నూనె రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది ఎంతవరకు నిజం? శాస్త్రీయ ఆధారాలతో సమాధానం ఇదిగో..
Advertisement

Oil for Hair: మన అమ్మమ్మ నుంచి అమ్మ వరకూ తరచూ చెప్పే మాటేంటంటే.. జుట్టుకు ఆయిల్ రాసుకో, లేదంటే జుట్టు పెరగదు అని చెబుతుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం ఆయిల్ రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందనే నమ్మకాన్ని ఓ అపోహ గానే కొట్టిపారేశారు. తలకు నూనె రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

నూనె ఒక్కటే కారణం కాదు:

నిజానికి జుట్టు యొక్క ఆరోగ్యం.. మనలోని జన్యువులు, తీసుకునే పౌష్టికాహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. పాతకాలం మనుషుల్లో జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి కారణం వాళ్లు అనుసరించిన స్వచ్ఛమైన ఆహారమే తప్ప.. నూనె కాదని స్పష్టం చేశారు. నూనె అనేది కేవలం జుట్టుకు ఒక సహజమైన కండీషనర్‌లా పనిచేస్తుంది. దీంతో వెంట్రుకలు మెరిస్తూ, చిక్కుపడకుండా మృదువుగా తయారవుతుందని చెబుతున్నారు.

Advertisement

Also Read: పిల్లల్లో మొబైల్ వ్యసనానికి చెక్ పెట్టాలా? పేరెంట్స్ పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!

అలాంటి వాళ్లు నూనె రాసుకుంటే:

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వాళ్లు తరచూ జుట్టుకు ఆయిల్ రాసుకోవడం వలన మరిన్ని కష్టాలు తెచ్చుకుంటారని వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా తలలో చుండ్రు ఉన్నవాళ్లు నూనె రాసుకుంటే.. అది చుండ్రును మరింత పెంచి దురదకు కారణమవుతుంది. అలాగే ముఖంపై ఎక్కువగా మొటిమలు ఉన్నవారు, సెబోర్హెయిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఆయిల్‌కు దూరంగా ఉండాలట.

అరగంట చాలు:

Advertisement

ఒకవేళ నూనె రాసే అలవాటు ఉంటే.. తలస్నానానికి కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే రాసుకోవాలని చెబుతున్నారు. అలా కాదని రాత్రంతా ఉంచడం వల్ల చుండ్రు, జుట్టురాలే సమస్య ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటే.. ఆయిల్స్ మీద ఆధారపడకుండా, సరైన వైద్య చికిత్స తీసుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.

Also Read: మితంగా తాగినా ముప్పేనా? నోటి క్యాన్సర్‌పై శాస్త్రవేత్తల సంచలన హెచ్చరిక!

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×