Malavika Mohanan: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఫలానా హీరో, హీరోయిన్ ను దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా కథ సిద్ధం చేస్తారు. ఇలా సినిమా కథ మొత్తం సిద్ధమైన తర్వాత వారిని సంప్రదించి కథ వివరించగా కొన్ని కారణాల వల్ల సెలబ్రిటీలు ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో పశ్చాత్తాపం పడిన వాళ్ళు ఉన్నారు అలాగే కొన్ని సినిమాలను మిస్ చేసుకుని డిజాస్టర్ ల నుంచి తప్పించుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్ కూడా ఒకరు.
ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో సినిమా అవకాశం వస్తే ఇతర ప్రాజెక్టులను కూడా వదులుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే ఓ ముద్దుగుమ్మ మాత్రం ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అయితే అప్పుడు రిజెక్ట్ చేసిన ఈమెకు ఇప్పుడు ది రాజా సాబ్(The Raja Saab) సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే నటి మాళవిక మోహనన్(Malavika Mohanan) సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిలో మాళవిక మోహన్ కూడా ఒకరు. ప్రభాస్ తో ఈమెకు ఈ సినిమా మొదటి సినిమా కావటం విశేషం .అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ప్రభాస్ తో కలిసి సలార్ (Salaar)సినిమాలో చేసే ఛాన్స్ వచ్చిందని తెలిపారు . డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు కానీ ఆ సమయంలో నాకున్న షెడ్యూల్ కారణంగా ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.. అప్పుడు సలార్ మిస్ అయిన ఇప్పుడు రాజా సాబ్ సినిమాలో ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
హర్రర్ కామెడీ నేపథ్యం..
ఈ సినిమాలో ఈమె ప్రభాస్ తో కలిసి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ తో కలిసి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తెలియజేశారు. మాళవికతో పాటు ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి.
Also Read: Psych siddartha OTT: ఆ ఓటీటీకే సైక్ సిద్ధార్థ డిజిటల్ రైట్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?