E-Paper
Advertisement

Carrot Juice: ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగితే జుట్టు పొడవుగా పెరుగుతుందా?

Carrot Juice: ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగితే జుట్టు పొడవుగా పెరుగుతుందా?
Advertisement

క్యారెట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. కళ్ల నుంచి జుట్టు వరకు అనేక రకాలుగా మనకు మేలు చేస్తాయి. అయితే క్యారెట్ జ్యూస్ తాగితే జుట్టు వేగంగా పెరుగుతుందని కొంతమంది నమ్మకం. ఇది ఎంత వరకు నిజమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామందికి క్యారెట్ జ్యూస్ అంటే ఆరోగ్యం, కళ్లకు మంచిది అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం ప్రారంభించారు. అయితే నిజంగా ఇది జుట్టు పెరగడానికి మంత్రంలా పనిచేస్తుందా ?

క్యారెట్లో ఏముంటాయి?
క్యారెట్‌లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, బీటా-క్యారోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ A తల చర్మంలో సహజమైన నూనె (సెబమ్) ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది తల చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. విటమిన్ C శరీరంలో కొల్లాజెన్ తయారీలో సహాయపడుతుంది. కొల్లాజెన్ జుట్టు బలంగా ఉండటానికి అవసరం. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే ఈ పోషకాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, క్యారెట్ జ్యూస్ తాగితే జుట్టు ఒక్కసారిగా వేగంగా పెరుగుతుందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు. అంటే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల వెంటనే ఫలితం కనిపించదు.

Advertisement

జుట్టు ఆరోగ్యం అనేది కేవలం ఒకే ఆహారంపై ఆధారపడదు. సరైన పోషకాహారం, తగిన నిద్ర, ఒత్తిడి తగ్గించడం, తల చర్మ సంరక్షణ … ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. క్యారెట్ జ్యూస్ కూడా ఈ సమతుల ఆహారంలో ఒక భాగంగా ఉంటే మంచిదే కానీ అది ఒక్కటే సరిపోదు. కొంతమంది క్యారెట్ జ్యూస్‌ను బయట నుంచి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు హెయిర్ మాస్క్‌లలో లేదా నూనెలో కలిపి తలకు రాస్తారు. ఇది తల చర్మానికి తేమనిచ్చి జుట్టు మెరుగు పడటానికి సహాయపడవచ్చు. అయితే ఇది కూడా వెంటనే జుట్టు పెరుగుదలను పెంచదు.

Also read: Homemade Skin care: జపనీయుల్లాగా మీ చర్మం మెరిసిపోవాలంటే వీటిని వాడండి చాలు

Advertisement

క్యారెట్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ అధిక మొత్తంలో క్యారెట్ తీసుకున్నా లేక క్యారెట్ జ్యూస్ తాగినా విటమిన్ A ఎక్కువగా శరీరంలో చేరిపోతుంది. ఇది కూడా ప్రమాదకరం. అధిక మోతాదులో విటమిన్ A శరీరంలో చేరితే జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి క్యారెట్ జ్యూస్‌ను మితంగా తీసుకోవడం మంచిది. రోజుకు ఒక గ్లాస్ సరిపోతుంది. జుట్టు రాలిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. హార్మోన్ మార్పులు, ఒత్తిడి, పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాలు వంటివి ప్రధాన కారణాలు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

క్యారెట్ జ్యూస్ జుట్టు ఆరోగ్యానికి సహాయపడే పోషకాలు అందిస్తుంది. కానీ అది జుట్టు వేగంగా పెరుగుదలకుపరిష్కారం కాదు. సమతుల్య ఆహారం, సరైన జీవనశైలి, తల చర్మ సంరక్షణతో పాటు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపించవచ్చు. అందుకే క్యారెట్ జ్యూస్‌ను ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా కొనసాగించవచ్చు. కానీ దాన్ని జుట్టు పెరుగుదలకు ఒక్కటే మార్గమని నమ్మడం మాత్రం సరైంది కాదు. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించడం ద్వారా మాత్రమే జుట్టు బలంగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

Also read: Beauty Drink: ఉదయాన్నే ‘టర్మరిక్ జింజర్ షాట్’ తాగితే చర్మం సహజంగా మెరిసిపోతుంది

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×