Thriller movie OTT : ఈమధ్య ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమాలని ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇన్వెస్టిగేషన్, సైకో కిల్లర్స్, మర్డర్ మిస్టరీ వంటి స్టోరీలను సరికొత్తగా అందించేందుకు మేకర్స్ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ్ నుంచి వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. మామూలుగా పోలీసులకు చిక్కకుండా ఉండడానికి క్రిమినల్స్ పారిపోతూ ఉంటారు. ఇందులో విచిత్రంగా ఒక క్రిమినల్ వల్ల పోలీసు ఇబ్బందుల్లో పడతాడు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గా సాగే ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రాజా రంగుస్కీ’ (Raja Ranguski). ధరణి ధరన్ నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు ఈ సినిమాకి . ఈ చిత్రంలో మెట్రో శిరీష్ (రాజా), చాందిని తమిళరసన్ (రంగుస్కీ) ప్రధాన పాత్రలు పోషించగా, అనుపమ కుమార్, కల్లూరి వినోద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పేరును దివంగత ప్రముఖ రచయిత సుజాత (రంగూస్కీ కలం పేరు) గౌరవార్థం పెట్టారు. ఈ చిత్రం 2018 సెప్టెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం Zee5 లో అందుబాటులో ఉంది.
రాజా ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. అతను రంగుస్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రంగుస్కీకి రచయిత్రి కావాలనే కోరిక ఉంటుంది. ఆమెను ప్రేమలో పడేయటం కోసం రాజా ఒక చిన్న నాటకం ఆడతాడు. ఎవరో అపరిచిత వ్యక్తి ఆమెను వేధిస్తున్నట్లు ఫోన్ కాల్స్ చేసి, ఆ తర్వాత తనే ఆమెను కాపాడుతున్నట్లు నటిస్తాడు. కానీ అనూహ్యంగా ఒక నిజమైన అపరిచిత వ్యక్తి రంగంలోకి దిగి రాజాకే ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెడతాడు. రాజా చేసిన చిన్న తప్పు కాస్తా పెద్ద సమస్యగా మారి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, రంగుస్కీ ఇంటి పక్కనే ఉండే మారియా అనే మహిళ దారుణంగా హత్యకు గురవుతుంది. ఆ హంతకుడు ఎవరో కాదు, రాజాయే అని పోలీసులు నమ్మేలా సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక తన నిజాయితీని నిరూపించుకోవడానికి రాజా పోలీసుల నుండి తప్పించుకుని, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు వేట మొదలు పెడతాడు. చివరికి అసలు హంతకుడుని రాజా కనిపెడతాడా ? ఆ ఫోన్ కాల్స్ వెనుక ఉన్నది ఎవరు? ఈ కేసు నుంచి రాజా బయట పడతాడా ? అనే విషయాలన ఈ సినిమాను చూసి తలుసుకోవాల్సిందే.
Read Also : మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే