E-Paper
Advertisement

Holi Colours: ముఖంపై హోలీ రంగులు వదలడం లేదా? కలబంద జెల్ ఇలా వాడండి

Holi Colours: ముఖంపై హోలీ రంగులు వదలడం లేదా? కలబంద జెల్ ఇలా వాడండి
Advertisement

హోలీ పండగలో రంగులు ఆడినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఆ రంగులను వదిలించుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కెమికల్ రంగులు చర్మానికి అతుక్కుపోయి సులభంగా పోవు. కొందరికి చర్మం ఎర్రబడటం, మంట రావడం, పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ పరిస్థితుల్లో సహజమైన పరిష్కారంగా ఎలొవెరా జెల్ ఉపయోగపడుతుంది. కలబంద జెల్‌లో చర్మాన్ని చల్లబరచే, మంట తగ్గించే గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి, రంగులు సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. కెమికల్ సబ్బులు లేదా గట్టిగా రుద్దడం వల్ల చర్మం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ముందుగా సహజమైన పద్ధతులు ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు.

కలబంద జెల్ ఎలా ఉపయోగించాలి?
హోలీ ఆడిన తర్వాత ముందుగా చల్లని నీటితో ముఖం, చేతులు, మెడ వంటి భాగాలను శుభ్రంగా కడగాలి. తర్వాత తాజా ఎలొవెరా జెల్ తీసుకుని రంగు పట్టిన ప్రాంతాల్లో నెమ్మదిగా రాయాలి. సుమారు పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మృదువుగా మసాజ్ చేస్తూ నీటితో కడగాలి. ఇలా చేస్తే రంగు నెమ్మదిగా తొలగిపోతుంది. కలబంద జెల్‌లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి రాస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, పొడిబారకుండా కాపాడుతుంది.

Advertisement

Also read: Cabbage Kofta Curry: క్యాబేజ్ కోఫ్తా కర్రీ.. ఇలా చేస్తే బగారా రైస్ తో అదిరిపోతుంది, తింటే మర్చిపోలేరు

కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంలో వచ్చిన ఎర్రదనం, మంట తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. రంగులు వలన చర్మం పొడిబారినప్పుడు ఎలొవెరా చర్మానికి తేమను అందిస్తుంది. హోలీ ఆడే ముందు చర్మానికి కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాసుకుని ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. హోలీ రంగులు వదిలించుకునేందుకు గట్టిగా రుద్దడం, స్క్రబ్ వాడడం వంటివి చేయకూడదు.హాట్ వాటర్ కాకుండా చల్లటి లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.

Advertisement

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
రంగులు తొలగించిన తర్వాత కూడా చర్మంపై తీవ్రమైన మంట, అలర్జీ, దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవడం ముఖ్యం. స్వయంగా మందులు వాడకూడదు. హోలీ తర్వాత చర్మాన్ని కాపాడుకోవడానికి అలొవెరా జెల్ మంచి పరిష్కారం. ఇది చర్మాన్ని కూల్ చేసి రంగులు నెమ్మదిగా తొలగించడంలో సహాయపడుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో పండగ ఆనందంగా పూర్తవుపోతుంది.

Also read: Hair care: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? వెంటనే వీటిని తినడం మొదలుపెట్టండి

Related News

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

Big Stories

Advertisement
×