E-Paper
Advertisement

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ భారీ అగ్నిప్రమాదం.. బాచుపల్లిలో దగ్ధమైన ఫర్నిచర్ షాపు

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ భారీ అగ్నిప్రమాదం.. బాచుపల్లిలో దగ్ధమైన ఫర్నిచర్ షాపు
Advertisement

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని నిజాంపేట్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాచుపల్లి-ప్రగతినగర్ ప్రధాన రోడ్డుపై ఓ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో షాపు అంతా వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకున్నారు. కొద్దిగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

హైదరాబాద్‌ భారీ అగ్నిప్రమాదం

Advertisement

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నిజాంపేట్ సర్కిల్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లి-ప్రగతినగర్ ప్రధాన రహదారిపై ఓ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు మిగతా షాపులకు వ్యాపించడంతో నిమిషాల వ్యవధిలో మంటలు చుట్టుముట్టాయి. దాదాపు రూ.5 కోట్ల ఆస్తి నష్టం నిర్వాహకుల అంచనా.

మంగళవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ షాపులో షార్టు సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఓ షాపు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. నిమిషాల వ్యవధిలో పక్కనున్న మిగతా షాపులకు వ్యాపించాయి. అయితే కొందరు వ్యాపారులు అందులో నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు.

Advertisement

 బాచుపల్లిలో దగ్ధమైన ఫర్నిచర్ షాపు.. భారీగా ఆస్తినష్టం

వంట గ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడంతో పక్కనున్న కేజీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ముందు భాగం వరకు మంటలు వ్యాపించాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. కొద్ది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం భారీగా జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×