E-Paper
Advertisement

Cabbage Kofta Curry: క్యాబేజ్ కోఫ్తా కర్రీ.. ఇలా చేస్తే బగారా రైస్ తో అదిరిపోతుంది, తింటే మర్చిపోలేరు

Cabbage Kofta Curry: క్యాబేజ్ కోఫ్తా కర్రీ.. ఇలా చేస్తే బగారా రైస్ తో అదిరిపోతుంది, తింటే మర్చిపోలేరు
Advertisement

క్యాబేజ్‌తో చేసే వంటలు అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ క్యాబేజీతో చేసే కోఫ్తా కర్రీ మాత్రం ఎవరికైనా నచ్చుతుంది. ఇంట్లోనే చాలా సులువుగా క్యాబేజీ కోఫ్తా కర్రీ వండేసుకోవచ్చు. దీని రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

క్యాబేజీ కోఫ్తా కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యాబేజీ తురుము – రెండు కప్పులు
ఉల్లిపాయ – మూడు
పచ్చిమిర్చి – రెండు
శెనగపిండి – ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
కారం పొడి – రెండు స్పూన్లు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – వేయించడానికి సరిపడా
టమాటాలు – రెండు
ధనియాల పొడి – ఒక స్పూన్
జీలకర్ర పొడి – అర స్పూన్
గరం మసాలా – అర స్పూన్
పసుపు – చిటికెడు
నీరు – అవసరమైనంత

Advertisement

Also read: Hair care: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? వెంటనే వీటిని తినడం మొదలుపెట్టండి

క్యాబేజీ కోఫ్తా కర్రీ రెసిపీ
1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో తురిమిన క్యాబేజ్ వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఒక స్పూను కొత్తిమీర తరుగు కలపాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
2. ఇప్పుడు శెనగపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ముద్దలా కలపాలి. క్యాబేజ్‌లోనే నీరు వస్తుంది కాబట్టి అదనంగా నీరు అవసరం ఉండదు. ఈ మిశ్రమం గట్టిగా ఉండాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక ఈ ఉండలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వాటిని టిష్యూ పేపర్ మీద పెట్టాలి. ఇలా కోఫ్తాలు సిద్ధమైనట్టే.
4. ఒక స్టవ్ మీద మరొక కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. అందులో ఉల్లిపాయలు తరుగు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముదురు వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి బాగా మెత్తగా అయ్యే వరకు వండాలి.
6. తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి బాగా కలపాలి.కొద్దిగా నీరు పోసి మరిగించాలి.
7. గ్రేవీ మందంగా అయ్యాక గరం మసాలా వేసి కలపాలి.గ్రేవీ బాగా మరిగిన తర్వాత స్టవ్ మంట తక్కువ చేసి ముందుగా వేయించిన కోఫ్తాలను గ్రేవీలో వేయాలి. ఎక్కువగా కలపకూడదు. లేకపోతే కోఫ్తాలు విరిగిపోతాయి.
8. మూత పెట్టి అయదు నిమిషాలు ఉడకనవ్వాలి. దీంతో కోఫ్తాలు ఇగురును పీల్చుకుంటాయి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే టేస్టీ క్యాబేజీ కోఫ్తా కర్రీ సిద్ధమైనట్టే.

Advertisement

Also read: Egg Pakoda: క్రిస్పీగా మూడు గుడ్లతో ఎగ్ పకోడా ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

క్యాబేజ్ కోఫ్తా కర్రీ వేడి వేడి చపాతీ, రోటీ, పూరీ లేదా తెల్ల అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పండగల రోజుల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు దీన్ని ప్రత్యేకంగా వండి వడ్డించవచ్చు. ఒక్కసారి తింటే రుచి మర్చిపోలేరు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×