E-Paper
Advertisement

Hair care: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? వెంటనే వీటిని తినడం మొదలుపెట్టండి

Hair care: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? వెంటనే వీటిని తినడం మొదలుపెట్టండి
Advertisement

జుట్టు ఊడిపోవడం ఇప్పుడు అందరి సమస్యగా మారిపోయింది. ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, ట్రీట్‌మెంట్‌లు వాడినా ఫలితం కనిపించక నిరాశ చెందుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన ఇంట్లోనే దొరికే సాధారణ భారతీయ ఆహారాలే జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు ప్రధానంగా ప్రోటీన్‌ అవసరం. అందుకే ప్రోటీన్ తక్కువైతే జుట్టు బలహీనంగా మారి సులభంగా ఊడిపోతుంది. గుడ్లు ప్రోటీన్, బయోటిన్‌కు మంచి మూలం. ఇవి జుట్టు వేర్లను బలంగా ఉంచుతాయి. గుడ్లు తినని వారు పప్పులు, పనీరు, టోఫు వంటి ఆహారాలు తీసుకోవచ్చు. ఇవి కూడా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

ఆకుకూరలు
పాలకూర, మెంతికూర, ఇతర ఆకుకూరల్లో ఇనుము (ఐరన్) ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి జుట్టు రాలిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇనుము శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు వేర్లకు బలం వస్తుంది. వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు ఆకుకూరలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఉసిరికాయలు
ఆమ్లాలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆమ్లా జ్యూస్, పచ్చడి లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. సహజంగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Also read: Homemade Skin care: జపనీయుల్లాగా మీ చర్మం మెరిసిపోవాలంటే వీటిని వాడండి చాలు

Advertisement

నట్స్, గింజలు
బాదం, ఆక్రోట్, పంప్కిన్ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి జుట్టు పొడిబారకుండా కాపాడతాయి. జుట్టు విరిగిపోవడాన్ని తగ్గిస్తాయి. రోజుకు కొద్దిగా నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే కాకుండా జుట్టుకూ మేలు చేస్తుంది.

పప్పులు
మినుములు, కంది పప్పు, రాజ్మా వంటి పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చే ఆహారం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా అవసరం. ఇంట్లో వండే సాధారణ పప్పు కూడా జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.

Also read: Conch for Vastu: ఇంట్లో శంఖం ఉంటే ఎన్ని శుభఫలితాలో.. ఆ కష్టాలన్నీ దూరం

పెరుగు,మజ్జిగ
జీర్ణశక్తి బాగుండాలంటే శరీరానికి పోషకాలు సరిగ్గా అందాలి. పెరుగు, మజ్జిగ వంటి ఫెర్మెంటెడ్ ఆహారాలు కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మంచి జీర్ణక్రియ వల్ల తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

క్యారెట్
క్యారెట్, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారి స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిబారిన తల చర్మం కూడా జుట్టు రాలిపోవడానికి ఒక కారణం. కాబట్టి కూరగాయలను ఆహారంలో తప్పక చేర్చాలి.

ఆహారం మాత్రమే కాదు, జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ సార్లు హెయిర్ స్టైలింగ్ చేయడం, కెమికల్స్ ఎక్కువగా వాడటం వంటివి జుట్టును బలహీనపరుస్తాయి. రోజుకు సరిపడా నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×