E-Paper
Advertisement

Turmeric Milk: రాత్రి పూట పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగారంలే మీరు ఊహించని ప్రయోజనాలు

Turmeric Milk: రాత్రి పూట పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగారంలే మీరు ఊహించని ప్రయోజనాలు
Advertisement

ఇంట్లో సులభంగా పసుపు లభిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఔషధంలాంటిది. పసుపును పాలలో కలిపి తాగడం ప్రాచీన ఆయుర్వేదం నుంచి వస్తున్న ఓ సంప్రదాయం. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు కూడా ఈ పానీయం శరీరానికి కలిగించే అనేక ప్రయోజనాలు ఉన్నట్టు చెబుతోంది. ముఖ్యంగా రాత్రిపూట పసుపు పాలు తాగితే నిద్ర నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నిద్ర నాణ్యత పెరుగుతుంది
గోరువెచ్చని పాలు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో రాత్రి నిద్ర ప్రశాంతంగా పడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఒత్తిడిని తగ్గించగల శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల నిద్రపాటు కష్టపడే వారికి ఈ పానీయం ఎంతో ఉపయోగం.

Advertisement

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. రాత్రిపూట పసుపు పాలు తాగితే శరీరం రోగాల్ని ఎదుర్కొనే శక్తిని పొందుతుంది. తరచూ జలుబు, దగ్గు వచ్చే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. పిల్లలు నుంచి పెద్దలు అందరికీ ఇది శరీర రక్షణను పెంచే సహజ మార్గం.

కీళ్లు, కండరాల నొప్పులకు
రోజంతా పని, స్ట్రెస్, వ్యాయామం మూలంగా కండరాల్లో నొప్పి కలగడం సహజం. కర్కుమిన్ వాపు తగ్గించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులు, శరీర నొప్పులు ఉన్నవారికి రాత్రిపూట పసుపు పాలు తాగడం ఉపశమనం కలిగించగలదు.

Advertisement

జీర్ణక్రియ మెరుగుపడుతుంది
పసుపు పేగు సమస్యలను తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. గ్యాస్‌, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాత్రిపూట పసుపు పాల తాగితే పేగులు శుభ్రపడటంతో పాటు ఉదయం లేవగానే శరీరం హాయిగా అనిపిస్తుంది.

చర్మం ప్రకాశవంతంగా
పసుపు లోపలి నుంచి చర్మాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. రాత్రిపూట తాగితే శరీరం నిద్రలో రిపేర్‌ చేస్తుంది. దానికి పసుపు సహకరిస్తుంది. దీంతో స్కిన్‌ గ్లో పెరుగుతుంది.

శ్వాస సంబంధ ఇబ్బందులు
జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్లేష్మం వంటి సమస్యలకు పసుపు పాలు ఒక సహజ ఔషధంలా పనిచేస్తాయి. పసుపులో ఉన్న యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయి. చిన్నపిల్లలకు కూడా దీనిని తగిన మోతాదులో ఇస్తే వేడి తగ్గి శ్వాస సుఖంగా మారే అవకాశం ఉంది.

శరీరాన్ని డిటాక్సిఫికేషన్
కర్కుమిన్ కాలేయానికి మంచి మద్దతు ఇస్తుంది. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్‌ను బయటకు పంపే ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది. రాత్రి ఒక గ్లాస్ పసుపు పాలు తాగితే శరీరం సహజంగా శుభ్రపడుతుంది.

పసుపు పాలు తయారీ
ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పెప్పర్‌ వేసుకుంటే కర్కుమిన్ ను శరీరం బాగా గ్రహిస్తుంది. కావాలంటే కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. రాత్రి నిద్రకు 30 నిమిషాల ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది

ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?
పాలు అలెర్జీ ఉన్నవారు తప్పక వైద్య సలహా తీసుకోవాలి డయాబెటిస్ ఉన్నవారు చక్కెర కలపకుండా తాగాలి. గర్భిణీలు అధిక మోతాదులో పసుపు వాడకూడదు. మోతాదు ఎక్కువైతే కడుపులో మంట, ఆమ్ల సమస్యలు రావచ్చు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×