ఓ పెద్ద హాస్పిటల్. దాని కింద ఓ అండర్ గ్రౌండ్. అందులో ఏకంగా 10 వేల మానవ మెదళ్లు. ఒక్కసారి ఊహించుకోండి. భయంతో వెన్నులో సన్నని వణుకు పుడుతుంది కదా. ఇదేదో.. సమంత నటించిన ‘యశోద’ లాంటి సినిమాలో మాదిరి సీన్ కాదు. నిజ జీవితంలో జరిగిన భయానక ఘటన. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? చేసింది ఎవరంటే..
చరిత్రలో కనీవినీ ఎరుగని ఈ ఘటన డెన్మార్క్ లో జరిగింది. ఆ దేశంలో ఓ సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయం (SDU) అనే పేరు మోసిన యూనివర్సిటీ ఉంది. ఇందులోని ఓ అండర్ గ్రౌండ్ లో సురక్షితమైన గదిని ఏర్పాటు చేశారు. సుమరు 10 వేల మానవ మెదళ్లను భద్రపరిచారు. చెడిపోకుండా సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేక ద్రవంతో నింపిన తెల్లటి ప్లాస్టిక్ బకెట్లలో నిల్వ చేశారు.
ఈ భయానక ఘటన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ప్రారంభమైంది. దీని వెనుక ఇద్దరు వైద్యులు ఉన్నారు. వారిద్దరు మానసిక అనారోగ్యం గురించి అధ్యయనం చేయాలనుకున్నారు. మానవ మెదళ్లను పరిశీలిస్తే, ప్రజలు ఎందుకు విచార పడుతున్నారు? భయానికి గురవుతున్నారు? సంతోషం ఎలా వస్తుంది? అనే వివరాలను తెలుసుకోవాలనుకున్నారు. అప్పటి నుంచి యూనివర్సిటీకి సంబంధించిన మానసిక ఆసుపత్రులలో మరణించిన వ్యక్తుల మెదళ్లను సేకరించడం మొదలు పెట్టారు. సుమారు 30 ఏళ్ల పాటు ఏకంగా 10 వేల మానవ మెదళ్లను సేకరించారు.
ఆ రోజుల్లో మానసిక అనారోగ్యానికి మంచి మందులు లేవు. రోగుల గురించి అంతగా పట్టింపులు ఉడేది కాదు. కుటుంబాలు కూడా డాక్టర్లను ప్రశ్నించేవారు కాదు. చనిపోయిన తర్వాత వారి మెదళ్లను తీశారనే విషయాన్ని కూడా గమనించేవారు. కాదు. అందుకే డాక్టర్లు, వారి మెదళ్లను తీసి, హాస్పిటల్ అండర్ గ్రౌండ్ లో భద్రపరిచే వాళ్లు. చాలా సంవత్సరాల పాటు నేలమాలిగలో మెదళ్లను దాచి ఉంచారనే విషయం కొద్ది మంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. సాధారణ ప్రజలకు అస్సలు తెలియదు.
ఈ మానవ మెదళ్లు ఎన్నో దశాబ్దాలుగా హాస్పిటల్ అండర్ గ్రౌండ్ లోనే భద్రంగా ఉన్నాయి. కొంతకాలం తర్వా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2018లో ఈ మెదళ్లను ధ్వంసం చేయాలని యూనివర్సిటీ భావించింది. కానీ, మానవ మెదళ్లకు సంబంధించిన పరిశోధనలో ఈ మెదళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వాటిని ధ్వంసం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని విశ్వ విద్యాలయంలోకి ప్రత్యేక గదికి తరలించాలని అధికారులను ఆదేశించింది.
మానవ మెదళ్లపై పరిశోధనకు ఈ హ్యూమన్ బ్రెయిన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మానసిక అనారోగ్యం మెదడును ఎలా మారుస్తుందనే అంశంపై చాలా మంది అధ్యయనం చేశారు. మందులు లేని సమయంలో మానవ మెదళ్లు ఎలా ఉండేవి? భవిష్యత్తులో మెరుగైన చికిత్సలు ఎలా చేయాలి? అనే అంశాల అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ మెదళ్లను అరుదైన సంపదగా భావిస్తున్నారు.
జాక్ డి. ఫిల్మ్స్ రూపొందించిన చిన్న వీడియో.. నవంబర్ 15న వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పాత విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ మానవ మెదళ్లను చూడాలనుకుంటే, కేవలం శాస్త్రవేత్తలు, విద్యార్థులు మాత్రమే లోపలికి వెళ్లగలరు. యూనివర్సిటీ వెబ్ సైట్ మాత్రం దీని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Read Also: తలనొప్పిని తగ్గించే ఐస్‌క్రీమ్.. ఇందులో ఆ పాపులర్ ట్యాబ్లెట్ కలుపుతున్నారట!