E-Paper
Advertisement

Health Tips: నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా?.. ఈ విషయంలో నిపుణులు మాట ఇదే!

Health Tips: నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా?.. ఈ విషయంలో నిపుణులు మాట ఇదే!
Advertisement

Health Tips: చాలామంది నిద్రకు ఉపక్రమించే ముందు మంచినీళ్లు తాగి పడుకుంటుంటారు. కొందరైతే నిద్రలో ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో లేచి నీళ్లు తాగుతుంటారు. మన శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటే హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట నీళ్లు తాగి పడుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కిడ్నీల్లోని మలినాలు బయటికి పోతాయి. అయితే, ఇలా రాత్రిపూట నిద్రపోయే ముందు నీళ్లు తాగే అలవాటు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటుగా హాని కూడా చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

నిద్రభంగం కలుగుతుంది:

నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వలన ఉండే ప్రధాన ఇబ్బందుల్లో మూత్రవిసర్జన ఒకటి. దీనికోసం నిద్రలేవడాన్నే మెడికల్ పరిభాషలో ‘నోక్టురియా’ అంటారు. నీళ్లు తాగి పడుకుంటే డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు కూడా లేచి బాత్రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఫలితంగా నిద్ర సరిపోక తర్వాత రోజున నీరసం, అలసట ఇబ్బంది పెడుతుంటుంది.

Advertisement

Read Also: భరించలేని తలనొప్పి క్షణాల్లో మాయం.. ఐస్ వాటర్‌లో దాగున్న అద్భుత రహస్యమిదే!

గుండెల్లో మంట:

పడుకునే ముందు నీళ్లు తాగే అలవాటున్న కొంతమందిలో గుండెల మీద బరువుగా ఉన్నట్టు, గుండెల్లో మంట కలిగిన భావన రావచ్చు. నిద్రపోయేటప్పుడు అడ్డంగా పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ సులువుగా అన్నవాహికలోకి వెనక్కి ప్రవహించవచ్చు. దీంతో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా మన నిద్రను త్యాగం చేయాల్సి ఉంటుంది.

శరీరానికి విశ్రాంతి ఉండదు:

Advertisement

మన బాడీను హైడ్రేటెడ్‌గా ఉంచడం కోసం.. చాలామంది నిద్రపోయే ముందు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. శరీరంలోకి చేరిన అధిక ద్రవాలను ప్రాసెస్ చేయడానికి మన బాడీలోని వివిధ అవయవాలు పని చేయాల్సి ఉంటుంది. దీంతో రాత్రిపూట నిద్రకు, విశ్రాంతికి ఇది అవాంతరంగా మారుతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

ముఖ్యంగా స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవాళ్లు పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగితే పలు ఇబ్బందులకు గురికావచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకునే నీళ్ల వల్ల శ్వాస సంబంధిత మార్గాలు ఉబ్బరాన్ని కల్గించవచ్చు. ఫలితంగా నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారవచ్చు.

మూత్రాశయం నిండిపోవడం:

నిద్రకు ఉపక్రమించే ముందు నీళ్లు తాగడం వల్ల మూత్రాశయం నిండిన భావన కలుగుతుంది. దీంతో తరచూ బాత్రూమ్‎కు వెళ్లాల్సి వస్తుంది. ఇది మన నిద్రకు భంగం కలిగిస్తుంది. అయితే.. రాత్రిపూట పడుకునే ముందు నీళ్లు తాగడం అనేది ఒక్కొక్కరి శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుంది. మరీ ఎక్కువ నీటిని కాకుండా శరీరం హైడ్రేటెడ్‎గా ఉండేందుకు సరిపడా నీళ్లు తీసుకుంటే సరిపోతుంది.

Read Also: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా?.. సులభమైన చిట్కాలతో నివారించండిలా!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×