E-Paper
Advertisement

Hyderabad Old City Blast: పాతబస్తీలో పేలుడు.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో

Hyderabad Old City Blast: పాతబస్తీలో పేలుడు.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో
Advertisement

Hyderabad Old City Blast: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇటీవల చోటుచేసుకున్న బ్లాస్టింగ్ ఘటనపై.. కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మొదట్లో ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదమని భావించినప్పటికీ, తాజాగా లభ్యమైన సీసీటీవీ ఫుటేజ్ ఈ ఘటనపై కొత్త సందేహాలను కలిగిస్తోంది. ఈ పేలుడికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సీసీటీవీ వీడియోలను బిగ్ టీవీ సేకరించి ప్రసారం చేయడంతో, స్థానికుల అనుమానాలు మరింత బలపడ్డాయి.

పేలుడు జరిగిన ప్రాంతంలోని గోమతి దుకాణంలో.. మూడు వైపులా ఒకేసారి విస్పోటనం సంభవించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగితే ఇంతటి తీవ్రస్థాయిలో పేలుడు సంభవించదన్న అభిప్రాయం నిపుణులు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇది సాధారణ విద్యుత్ ప్రమాదం కాకుండా మరేదైనా పేలుడు పదార్థం కారణమై ఉండొచ్చన్న కోణంలో.. దర్యాప్తు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

Advertisement

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. పేలుడు జరిగిన వెంటనే మంటలు వ్యాపించాయి. అంటే ముందు మంటలు వచ్చి ఆ తర్వాత పేలుడు సంభవించినట్లు కాకుండా, ముందుగా తీవ్రమైన పేలుడు జరిగి ఆ తర్వాత మంటలు చెలరేగినట్లు స్పష్టమవుతోంది. పేలుడు ధాటికి షాపు లోపల సుమారు మూడు అడుగుల లోతు గొయ్యి పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుమారు వంద అడుగుల పరిధి వరకు పేలుడు ప్రభావం కనిపించిందని స్థానికులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో గోమతి దుకాణ యజమానితో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. సీసీటీవీ దృశ్యాలలో షాపు వెనుక భాగంలో కూడా భారీ శబ్దంతో పేలుడు సంభవించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. అంటే ఒకే చోట కాకుండా ఒకేసారి రెండు, మూడు చోట్ల విస్పోటనం సంభవించినట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అసలు అనుమానాలకు కారణంగా మారింది. ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటి భారీ పేలుడు, ఈ స్థాయిలో ధ్వంసం సాధ్యమా? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం లభించలేదు.

Advertisement

మరోవైపు, ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే భారీ ప్రాణనష్టం సంభవించింది. దుకాణం పూర్తిగా ధ్వంసమై, చుట్టుపక్కల షాపులకు కూడా నష్టం వాటిల్లింది.

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో, నిపుణుల సహకారంతో దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేలుడు పదార్థాల ఆనవాళ్లు ఉన్నాయా? రసాయనాల వినియోగం జరిగిందా? లేదా ఎలక్ట్రికల్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అన్ని కోణాల్లో విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

Also Read: కాళేశ్వరం వేస్ట్.. నిజాంసాగరే బెస్ట్.. కవిత సంచలనం

ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఆధారాలతో పాటు ఫోరెన్సిక్ బృందాల సహాయంతో విచారణ చేపట్టారు. కానీ అసలు పేలుడికి కారణాలేంటన్నది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×