E-Paper
Advertisement

Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా?.. సులభమైన చిట్కాలతో నివారించండిలా!

Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా?.. సులభమైన చిట్కాలతో నివారించండిలా!
Advertisement

Bad Breath: నోటి దుర్వాసనతో బాధపడుతున్న వాళ్లు ఎవరితోనైనా దగ్గరగా మాట్లాడాలంటే ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల ఆత్మ విశ్వాసం కూడా తగ్గిపోతుంది. అయితే, నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఎప్పటికప్పుడు నాలుకను శుభ్రం చేసుకోవడం ఎంతైనా అవసరం. దీంతో శ్వాసను తాజాగా ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో నోటి దుర్వాసనకు గల కారణాలేమిటి? నివారించే మార్గాలేమిటో చూద్దాం.

నోటి దుర్వాసనకు కారణాలేమిటి?

నోటి నుంచి దుర్వాసన రావడాన్ని హాలిటోసిస్ అంటారు. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోనప్పుడు, దంతాల ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు, పేగులు ఆరోగ్యంగా లేనప్పుడు, అసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, తగినంత నీరు తాగకపోవడం.. ఇలా అనేక రకాల కారణాల వల్ల నోటి దుర్వాసన రావొచ్చు. అలాగే పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు నమలడం, చిగుళ్ల వ్యాధులు, తీవ్ర మలబద్ధకం వంటి కారణాలు కూడా దుర్వాసనకు దారితీస్తాయి. దీంతోపాటు నిద్రపోయే సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కూడా నోటి దుర్వాసన కారణం కావచ్చు.

Advertisement

Read Also: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?.. మీరు అనుకున్నదే నిజమైంది!

నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి:

నోటి దుర్వాసనకు ప్రధాన కారణం పండ్ల మధ్య ఉండే ప్లాక్, ఇరుక్కుపోయిన ఆహారం. ఈ ప్లాక్ అనేది బ్యాక్టీరియా పెరిగే అవకాశాన్ని కలిగిస్తుంది. దాంతో నోరు దుర్వాసన వస్తుంటుంది. కాబట్టి, ఉదయం నిద్రలేచాక, రాత్రి నిద్రపోయే ముందు ఇలా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల నోటి శ్వాసను తాజగా ఉంచుకోవచ్చు.

మౌత్ వాష్ తప్పనిసరి:

Advertisement

నోటి దుర్వాసనకు మౌత్ వాష్ సమర్థవంతమైన సాధనం. ఇది నోటిలోని బ్యాక్టీరియాను క్లీన్ చేయడంలో, నోటి తాజాదనాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కొన్ని మౌత్ వాషుల్లో టేట్రా ఫ్లోరిడ్స్, యాంటీబాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాబట్టి.. ప్రతిరోజూ నోటిని మౌత్ వాష్‌తో కడగటం వల్ల క్రమంగా దుర్వాసన పోతుంది.

పేగుల ఆరోగ్యం జాగ్రత్త:

నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం రోజూ తీసుకునే ఆహారమే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పళ్లల్లో ఇరుక్కున్న పదార్థాలన్నీ బ్రషింగ్‌తో పోవు. అందుకే రోజులో ఒకసారైనా ఫ్లాసింగ్ చేసుకోవాలి. దారంతో పళ్లమధ్య ఉన్నవాటిని తొలగించుకోవాలి. దీంతోపాటు శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలి.

తాజా పండ్లు తీసుకోవాలి:

శ్వాసను తాజాగా ఉంచడంలో ఉపయోగపడే పండ్లు, కూరగాయలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో భాగంగా.. యాపిల్స్, క్యారెట్లు, ఆకుకూరలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ కూరగాయలు నోటి దుర్వాసను కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే నారింజ తీసుకుంటే నోటి దుర్వాసను పోగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Read Also: ఇదేదో బాగుందే.. ఇలా బ్రష్ చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్ నుంచి రక్షణ పొందొచ్చట!

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×