E-Paper
Advertisement

మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా ? ఆటిజం కావొచ్చు !

మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా ? ఆటిజం కావొచ్చు !
Advertisement

Autism Early Signs: ప్రతి బిడ్డ ఎదుగుదల భిన్నంగా ఉంటుంది. అయితే.. కొందరు పిల్లలలో సామాజిక , కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధిలో జాప్యం కనిపిస్తుంది. దీనినే ‘ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్’ అంటారు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డకు 2 లేదా 3 ఏళ్లు వచ్చే వరకు వీటిని గమనించరు. కానీ.. శిశువు దశలోనే అంటే 6 నుంచి 12 నెలల మధ్య కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా ఆటిజం సంకేతాలను గుర్తించవచ్చు. ముందస్తు గుర్తింపు ద్వారా సరైన థెరపీలను అందిస్తే.. ఎదుగుదల సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శిశువులలో ఆటిజం ప్రారంభ లక్షణాలు:
ఆటిజం అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక స్థితి. ఇది బిడ్డ ఇతరులతో ఎలా మాట్లాడతారు. ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపై ప్రభావం చూపుతుంది. శిశువుల్లో కనిపించే కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు..

Advertisement

1. సామాజిక స్పందన లేకపోవడం :
సాధారణంగా శిశువులు 3-4 నెలల వయస్సులోనే తల్లిదండ్రుల ముఖం చూసి నవ్వడం, వారితో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడటం చేస్తారు.

ఐ కాంటాక్ట్ లేకపోవడం: ఆటిజం లక్షణాలు ఉన్న శిశువులు ఎదుటివారి కళ్ళలోకి చూడటానికి ఇష్టపడరు లేదా తక్కువగా చూస్తారు.

Advertisement

చిరునవ్వు లేకపోవడం: మీరు బిడ్డను చూసి నవ్వినప్పుడు లేదా వారితో ఆడుకుంటున్నప్పుడు వారు తిరిగి స్పందించకపోవడం లేదా అస్సలు నవ్వకపోవడం ఒక ముఖ్య లక్షణం.

2. పిలిచినా పలకకపోవడం:
చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డకు వినిపించడం లేదేమో అని భ్రమపడతారు.

9 నెలలు దాటిన తర్వాత కూడా బిడ్డను పేరు పెట్టి పిలిచినప్పుడు వారు తల తిప్పి చూడకపోవడం ఆటిజంకు ఒక సంకేతం కావచ్చు. కానీ వారు ఇతర శబ్దాలకు (ఉదాహరణకు టీవీ సౌండ్) స్పందిస్తుంటారు.

3. సైగలు లేదా కమ్యూనికేషన్ లో లోపం:
శిశువులు మాటలు రాకముందే చేతులతో సైగలు చేయడం ద్వారా తమకు కావాల్సినవి అడుగుతుంటారు.

సైగలు చేయకపోవడం: 12 నెలలు వచ్చినా చేత్తో వస్తువులను చూపించకపోవడం , బై-బై చెప్పకపోవడం, లేదా ఎత్తుకోమని చేతులు చాచకపోవడం వంటివి గమనించాలి.

అనుకరణ లేకపోవడం: ఎదుటివారు చేసే శబ్దాలను లేదా ముఖ కవళికలను అనుకరించకపోవడం.

4. మాటలు రావడం ఆలస్యం కావడం:
12 నెలల వయసులో ‘బాబ్లింగ్’ (అ.. అ.. బా.. బా.. వంటి శబ్దాలు) చేయకపోవడం.

16 నెలల వయసు వచ్చేసరికి ఒక్క పదం కూడా స్పష్టంగా పలకలేకపోవడం.

2 ఏళ్లు వచ్చినా రెండు పదాల వాక్యాలు చెప్పలేకపోవడం.

Also Read: యోగాతో కోపానికి చెక్.. ఈ సింపుల్ ఆసనాలతో బోలెడు బెనిఫిట్స్

5. ప్రవర్తన :
ఆటిజం ఉన్న పిల్లలు కొన్ని పనులను పదే పదే చేస్తుంటారు. చేతులను వింతగా ఆడించడం, శరీరాన్ని అటు ఇటు ఊపడం, లేదా వస్తువులను ఒకే వరుసలో అమర్చడం వంటివి చేస్తుంటారు. వారు ఆడుకునే బొమ్మలతో సాధారణ పద్ధతిలో కాకుండా.. కేవలం వాటి చక్రాలను తిప్పడం వంటి పనులపైనే ఎక్కువ దృష్టి పెడతారు.

6. ఇంద్రియ సున్నితత్వం :
కొందరు పిల్లలు కొన్ని రకాల శబ్దాలకు, వాసనలకు లేదా కాంతికి అతిగా స్పందిస్తారు. ఉదాహరణకు.. మిక్సీ శబ్దం వినగానే విపరీతంగా ఏడవడం లేదా కొన్ని రకాల బట్టలు ఒంటికి తగిలితే తట్టుకోలేకపోవడం.

తల్లిదండ్రులు ఏం చేయాలి?
మీ బిడ్డలో పైన పేర్కొన్న లక్షణాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కనిపిస్తే కంగారు పడకండి. అది ఆటిజమే కావాలని లేదు.. ఇతర ఎదుగుదల లోపాలు కూడా కావచ్చు. వెంటనే ఒక పీడియాట్రీషియన్ లేదా చైల్డ్ సైకాలజిస్ట్ ను సంప్రదించి ‘డెవలప్‌మెంటల్ స్క్రీనింగ్’ చేయించడం బెస్ట్.

Related News

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

Big Stories

Advertisement
×