E-Paper
Advertisement

బీఆర్ఎస్ దోపిడీపై పదేళ్లు ఎందుకు మౌనం? కిషన్ రెడ్డిని నిలదీసిన భువనగిరి ఎంపీ

బీఆర్ఎస్ దోపిడీపై పదేళ్లు ఎందుకు మౌనం? కిషన్ రెడ్డిని నిలదీసిన భువనగిరి ఎంపీ
Advertisement

Chamala Kiran Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని బీజేపీ నేతలు అనుసరిస్తున్న తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, మూసీ పునరుజ్జీవం, రాష్ట్ర అప్పులపై ఆయన స్పష్టతనిచ్చారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై కిషన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని చామల ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ చామల తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుండి 500 మిలియన్ డాలర్ల రుణం పొందేందుకు అవసరమైన ప్రిలిమినరీ ప్రపోజల్ రిపోర్టును ఇప్పటికే సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖా మంత్రికి, నీతి ఆయోగ్ కు సమర్పించినట్లు ఆయన సభకు వివరించారు. రాష్ట్రం ఇంత చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నిధులు తీసుకురావడంలో సహకరించకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.

Advertisement

తెలంగాణను పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని చామల ప్రశ్నించారు. “బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే, అవినీతి రాజ్యమేలుతుంటే కిషన్ రెడ్డి పదేళ్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీరు వాళ్లతో కుమ్మక్కయ్యారా?” అని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు బీఆర్ఎస్ వైఫల్యాలను గమనించే వారిని ఇంటికి పంపి, కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని చామల కోరారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవం, మెట్రో రెండవ దశ, రీజినల్ రింగ్ రోడ్ (RRR) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నుండి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలన్నారు. కిషన్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుని, లోక్‌సభలో కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడంలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు కేంద్రం వెన్నుదన్నుగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Read Also: Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×