E-Paper
Advertisement

చెవులలో పేరుకుపోయిన మురికిని వదిలించే.. సింపుల్ చిట్కాలు!

చెవులలో పేరుకుపోయిన మురికిని వదిలించే.. సింపుల్ చిట్కాలు!
Advertisement

Earwax: శరీరంలో మిగతా భాగాలను శుభ్రం చేసుకున్నట్లే.. చెవులను కూడా క్రమబద్ధంగా.. కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. చెవిలో సహజంగానే ఉత్పత్తి అయ్యే.. ‘గులిమి’ చెవిని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కానీ అది ఎక్కువైతే వినికిడి లోపం, చెవి నొప్పి వస్తాయి. చాలా మంది చెవులు క్లీన్ చేయడానికి వాడే ఇయర్ బడ్స్, పిన్నులు చెవి లోపలి పొరలను దెబ్బ తీస్తాయి. అందుకే.. ఎలాంటి నష్టం లేకుండా..  ఇంట్లోనే.. సురక్షితంగా చెవి మురికిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

చెవి మురికిని శుభ్రం చేసే సురక్షితమైన పద్ధతులు: 

Advertisement

మన చెవి లోపల ఉండే సెరుమినస్ గ్రంథులు గులిమిని ఉత్పత్తి చేస్తాయి. ఇది బయటి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చెవి లోపలికి.. వెళ్లకుండా.. అడ్డుకుంటుంది. అయితే.. కొంత మందికి ఈ వ్యాక్స్ గట్టిపడిపోయి. పేరుకుపోతుంది. ఈఎన్‌టీ నిపుణుల హెచ్చరికల ప్రకారం.. చెవిలో ఎలాంటి కడ్డీలు లేదా షార్ప్ వస్తువులు పెట్టకూడదు. చెవిని క్లీన్  చేయడానికి ప్రకృతి సిద్ధమైన, హోం రెమెడీస్..

1. ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె: 
గట్టిపడిన చెవి మురికిని మృదువుగా మార్చడానికి ఆలివ్ ఆయిల్ అద్భుతంగా పని చేస్తుంది.

Advertisement

ఎలా వాడాలి: ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా గోరు వెచ్చగా చేయాలి. రాత్రి పడుకునే ముందు రెండు లేదా మూడు చుక్కల నూనెను చెవిలో వేయాలి. తలను కాసేపు పక్కకు వాల్చి ఉంచాలి.

ఫలితం: ఇలా మూడు నాలుగు రోజులు చేయడం వల్ల లోపల గట్టిపడిన.. గులిమి మెత్తబడి, సహజంగానే.. బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కాటన్ క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి.

2. బేకింగ్ సోడా వాటర్ :
బేకింగ్ సోడాను గులిమిని కరిగించడానికి.. చాలా మంది వాడుతుంటారు.

ఎలా వాడాలి: అర టీస్పూన్ బేకింగ్ సోడాను రెండు టీస్పూన్ల గోరు వెచ్చని నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రాపర్ సహాయంతో రెండు చుక్కలు చెవిలో వేయాలి.

ఫలితం: ఇది చెవిలోని గట్టి వ్యాక్స్‌ను త్వరగా రసాయన చర్య ద్వారా కరిగిస్తుంది. కాసేపటి.. తర్వాత చెవిని కడిగేసి, పొడి క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి.

3. ఆపిల్ సైడర్ వెనిగర్ , ఐసోప్రోపైల్ ఆల్కహాల్: 
చెవిలో ఇన్ఫెక్షన్లు ఉన్నా.. మురికి ఎక్కువగా ఉన్నా ఈ కాంబినేషన్ బాగా పని చేస్తుంది.

ఎలా వాడాలి: సమాన పరిమాణంలో ఆపిల్ సైడర్ వెనిగర్, ఆల్కహాల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని చుక్కలు చెవిలో వేసి, ఒక నిమిషం తర్వాత తలను అటువైపు తిప్పి ద్రవాన్ని బయటకు వచ్చేలా చేయాలి.  ఇది చెవిలోని ఫంగస్‌ను చంపేస్తుంది. అయితే.. చెవి పోటు లేదా  గాయాలు ఉంటే.. దీనిని వాడకూడదు.

4. కొబ్బరి నూనె: 

పూర్వం నుంచి వాడే సురక్షితమైన పద్ధతి కొబ్బరి నూనె. ఇందులో యాంటీ మైక్రో బయల్ గుణాలు ఉంటాయి. ఇది చెవిలో.. బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది. గోరు వెచ్చని కొబ్బరి నూనెను రెండు చుక్కలు చెవిలో వేసి పడుకుంటే.. ఉదయానికల్లా మురికి అంతా లూజ్ అయి పోతుంది.

5. సాల్ట్ వాటర్ (ఉప్పు నీరు):
ఇది చాలా సులువైన పద్ధతి. అర కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిని కాటన్ బాల్ (దూది) సహాయంతో రెండు చుక్కలు చెవిలో పిండాలి. ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత తలను వాల్చి నీటిని బయటకు పంపేయాలి.

ఇయర్ బడ్స్ ఎందుకు వాడకూడదు? 
మనం వాడే కాటన్ ఇయర్ బడ్స్ నిజానికి చెవిని శుభ్రం చేయవు. అవి చెవిలోని మురికిని మరింత లోపలికి నెడతాయి. దీని వల్ల ఇయర్ డ్రమ్ బ్లాక్ అయిపోవడమే కాకుండా.. వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. చెవికి ‘సెల్ఫ్-క్లీనింగ్’ (స్వయంగా శుభ్రపరుచుకునే) గుణం ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు చెవిలోని పాత మురికి దానంతట అదే బయటకు వచ్చేస్తుంది.

పైన పేర్కొన్న ఇంటి చిట్కాలు సాధారణంగా పేరుకుపోయే మురికికి బాగా పనిచేస్తాయి. అయితే, చెవి నుంచి చీము రావడం, విపరీతమైన నొప్పి ఉండటం, వినికిడి ఒక్కసారిగా తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటే మాత్రం సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే ఈఎన్‌టీ (ENT) డాక్టర్‌ను సంప్రదించడం బెస్ట్.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×