E-Paper
Advertisement

ఎన్నికల హామీలు ఏమయ్యాయి? నారా లోకేష్‌పై చీటింగ్ కేసు పెట్టాలి.. వెల్లంపల్లి డిమాండ్

ఎన్నికల హామీలు ఏమయ్యాయి? నారా లోకేష్‌పై చీటింగ్ కేసు పెట్టాలి.. వెల్లంపల్లి డిమాండ్
Advertisement

YSRCP Demands: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసినందుకు గానూ మంత్రి నారా లోకేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి, అధికారం లోకి వచ్చాక మాట తప్పడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.

ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఉన్నాయని వెల్లంపల్లి విమర్శించారు. పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో 3 రూపాయలు, కర్ణాటకలో 7 రూపాయలు, తమిళనాడులో 10 రూపాయలు తక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం పన్నుల పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటూ, రోజూ రూ. 10 కోట్ల అదనపు భారాన్ని సామాన్యుడిపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్‌పై ప్రభుత్వానికి 28 రూపాయలు వస్తాయని, అందులో సగం తగ్గిస్తామని నాడు లోకేష్ హామీ ఇచ్చి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని మండిపడ్డారు.

Advertisement

ధరలు తగ్గించకపోగా కార్లు, బైక్‌లపై తిరగొద్దంటూ ప్రజలకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేస్తున్నారని ఆరోపించారు. వీటికి తోడు పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతి నెలా ఈవెంట్‌లు నిర్వహిస్తూ ప్రభుత్వ సొమ్మును తగలేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికైనా నీతి కబుర్లు చెప్పడం ఆపి, తక్షణమే టాక్సులు తగ్గించి ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ బాదుడు ఇలాగే కొనసాగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.

Also Read: మోడీ పిలుపు.. చంద్రబాబు సంచలన నిర్ణయం.. వీఐపీ కాన్వాయ్‌లకు కత్తెర!

Advertisement

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×