E-Paper
Advertisement

మహేష్ బాబు రెస్టారెంట్‌లో ఘోరమైన దోపిడీ.. బిల్లు చూస్తే గుండె ఆగాల్సిందే!

మహేష్ బాబు రెస్టారెంట్‌లో ఘోరమైన దోపిడీ.. బిల్లు చూస్తే గుండె ఆగాల్సిందే!
Advertisement

Restaurant Prices : సినిమాల్లో సూక్తులు చాలా చెప్పొచ్చు.కానీ వాటిని రియల్ లైఫ్ లో పాటించడం చాలా కష్టం అని మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.విషయంలోకి వెళ్తే ..ఏషియన్ గ్రూప్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పార్ట్నర్ షిప్ లో ‘మినర్వా కాఫీ షాప్’ తో కలిసి ‘AN Restaurants’ (ఏఎన్ రెస్టారెంట్స్) నడుపుతున్న సంగతి తెల్సిందే.అయితే ఈ బ్రాండ్‌కు చెందిన బంజారాహిల్స్ ‘AVN ప్యాలెస్ హైట్స్’అనే రెస్టారెంట్స్ రేట్లు చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

also read :‘పెద్ది’ ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరంజీవి.. డైలాగ్ లీక్ చేస్తూ ఊరమాస్ రివ్యూ!

Advertisement

అసలు విషయం ఏంటంటే 

రీసెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన బిల్లు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. లగ్జరీ, రాయల్ అంబియన్స్ అంటూ బిల్డప్ ఇవ్వడం బాగానే ఉన్నా.. అక్కడ వసూలు చేస్తున్న ధరలు మాత్రం దోపిడీని తలపిస్తున్నాయని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.బయట మార్కెట్‌లో కేవలం 20 రూపాయలకు దొరికే సాధారణ వాటర్ బాటిల్ ధర ఈ రెస్టారెంట్‌లో ఏకంగా 299 రూపాయలుగా ఉండటం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఒక నార్మల్ వాటర్ బాటిల్‌పై ఈ రేంజ్‌లో లాభాలు లాగడం ఎంతవరకు న్యాయమనే విమర్శలు వస్తున్నాయి. అలాగే బయట 40 రూపాయలు ఉండే ఒక డైట్ కోక్ క్యాన్ ధర ఇక్కడ 180 రూపాయలుగా మెనూలో ఉంచి కస్టమర్లను షాక్‌కు గురిచేస్తున్నారు.

Advertisement

సామాన్యుడి గుండె ఆగడం ఖాయం

ఇక మెనూ ఆర్డర్ మరియు బిల్లు విషయానికి వస్తే సామాన్యుడి గుండె ఆగడం ఖాయం. సదరు బ్లాగర్ కేవలం ఒక చికెన్ టిక్కా స్టార్టర్ (ధర రూ. 725), ఒక మటన్ బిర్యానీ (ధర రూ. 600) మాత్రమే ఆర్డర్ చేశారు. వీటితో పాటు రెండు డైట్ కోక్స్ (రూ. 360) తీసుకున్నారు. దీనికి ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలు అన్నీ కలిపి ఫైనల్ బిల్లు ఏకంగా 1,853 రూపాయలు వేశారు. కేవలం ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, రెండు కూల్ డ్రింక్స్‌కే దాదాపు రెండు వేల రూపాయల బిల్లు వేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫుడ్ టేస్ట్ బాగుందని బ్లాగర్ కవర్ చేసినప్పటికీ.. ఈ రేట్లు మాత్రం ముమ్మాటికీ మిడిల్ క్లాస్ జనాలను లూటీ చేయడమే అని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు నెటిజన్లు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ఇక ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు రెస్టారెంట్‌పై నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.ముఖ్యంగా ఒక తెలుగు నెటిజన్ పెట్టిన కామెంట్ విపరీతంగా హల్చల్ చేస్తోంది. అంత అమౌంట్ పెట్టి అక్కడ ఒక్క ప్లేట్ బిర్యానీ, స్టార్టర్ తిని చేతులు కాల్చుకునే బదులు.. హ్యాపీగా బయట రెండు కేజీల మేక మాంసం తెచ్చుకుని ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా వండుకుని తింటాం అంటూ రెస్టారెంట్ రేట్లని ఎకి పారేశాడు.

also read :‘పెద్ది’ కోసం దర్శకుడి 10 లక్షల మొక్కు.. వైరల్ అవుతున్న బుచ్చిబాబు కామెంట్స్!

ఇక మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ కేవలం సెలబ్రిటీ బ్రాండ్ పేరు చూసి, స్టార్ హోటల్ ముసుగులో అమాయక జనాలను మోసం చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ లగ్జరీ మేనేజ్‌మెంట్ అంటూ కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి మాత్రం ఈ స్టార్ హోటల్ దోపిడీపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.మొత్తానికి నా సినిమానే కాదు నా రెస్టారెంట్ రేట్లు కూడా గ్లోబల్ లెవెల్ అని మహేష్ ఫిక్స్ అయ్యాడన్న మాట !

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×