E-Paper
Advertisement

Periods Pills Side Effects: పీరియడ్స్ పిల్స్ వాడినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే ఇక పైకే!

Periods Pills Side Effects: పీరియడ్స్ పిల్స్ వాడినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే ఇక పైకే!
Advertisement

Periods Pills Side Effects: ఇప్పుడంతా చాలామంది అమ్మాయిలు చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏమిటంటే.. ఇంట్లో శుభకార్యం ఉందనో.. ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినా పీరియడ్స్ రాకుండా మందులు వాడుతున్నారు. అయితే, ఇలాంటి టాబ్లెట్స్ వాడటం వల్ల ఇటీవల ఒక యువతి ప్రాణాలు కోల్పోయిందనే వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇంట్లో పూజ ఉందని కేవలం మూడు రోజులు ఈ పిల్స్ వాడిన ఆ యువతికి, ముందుగా కాళ్లలో వాపులు వచ్చి ఆ తర్వాత మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన పీరియడ్స్ పిల్స్ వాడే ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరికగా మారింది.

శరీరంపై హార్మోన్ల ప్రభావం..

సాధారణంగా పీరియడ్స్ వాయిదా వేయడానికి వాడే టాబ్లెట్లలో ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి సహజంగా వచ్చే బహిష్టు చక్రాన్ని అడ్డుకుంటాయి. డాక్టర్ల ప్రమేయం లేకుండా సొంతంగా మెడికల్ షాపులకు వెళ్లి ఇలాంటి మందులు కొని వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కేవలం పీరియడ్స్ ఆలస్యం కావడమే కాకుండా, రక్తంలో గడ్డలు కట్టడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. మీకు షుగర్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువట!

కాళ్ల వాపులతో మొదలై..

వైద్య పరిభాషలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అని పిలిచే సమస్య ఈ టాబ్లెట్ల వల్ల వచ్చే ప్రమాదం ఉంది. అంటే.. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. అందుకే సదరు యువతికి కాళ్ల వాపులు వచ్చాయి. ఆ గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులకు లేదా గుండెకు చేరినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుంది. దీనినే ‘పల్మనరీ ఎంబోలిజం’ అంటారు. కాబట్టి కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి.

ఈ జాగ్రత్తలు పాటించకపోతే..

Advertisement

పీరియడ్స్ అనేది ఒక సహజమైన ప్రక్రియ. అత్యవసరమైతే తప్ప దాన్ని వాయిదా వేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మందులు వాడాల్సి వస్తే, ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. మీకు ఇదివరకే అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలను ఉంటే.. డాక్టర్లు తక్కువ మోతాదులో పిల్స్ సూచిస్తారు. ప్రొఫెషనల్ సలహా లేకుండా వాడే ఒక్క టాబ్లెట్ అయినా సరే మీ ప్రాణాల మీదకు తీసుకురావచ్చని గుర్తుంచుకోండి. ఆరోగ్యం కంటే.. ఏ పూజ లేదా వేడుక ముఖ్యం కాదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అవగాహనతో మెలిగి, మీ ప్రాణాలను రక్షించుకోండి.

Also Read: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×