E-Paper
Advertisement

Heart Attack: మీ గుండె పదిలంగా.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే మార్గాలివే!

Heart Attack: మీ గుండె పదిలంగా.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే మార్గాలివే!
Advertisement

Heart Attack: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే.. భయపడాల్సిన అవసరం లేదు. మన డైలీ లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా గుండె పోటు ప్రమాదాన్ని.. గణనీయంగా తగ్గించుకోవచ్చు. క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్, అవగాహన మాత్రమే మనల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యం కోసం మనం పాటించాల్సిన సులభమైన అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన అలవాట్లు :
1. పోషకాహారం, సమతుల్య ఆహారం:
మనం తినే ఆహారమే మన గుండె ఆరోగ్యానికి పునాది. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఉప్పు (సోడియం) వాడకాన్ని తగ్గించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే.. వేపుళ్లు, జంక్ ఫుడ్ , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు లేదా బాదం, వాల్‌నట్స్ వంటివి గుండెకు మేలు చేస్తాయి.

Advertisement

2.  శారీరక శ్రమ:
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, పరుగు, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల గుండె కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా.. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జిమ్2కు వెళ్లలేకపోయినా, మెట్లు ఎక్కడం లేదా ఇంటి పనులు చేసుకోవడం కూడా శారీరక శ్రమ కిందకే వస్తుంది.

3. ఒత్తిడి :
ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడి గుండె పోటుకు ప్రధాన కారణం అవుతోంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి గుండెపై భారం పడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన హాబీలను అనుసరించండి. తగినంత నిద్ర (7-8 గంటలు) కూడా గుండె ఆరోగ్యానికి అత్యవసరం.

Advertisement

4. దురలవాట్లకు స్వస్తి:
ధూమపానం, మద్యపానం గుండె రక్తనాళాలను దెబ్బతీస్తాయి. సిగరెట్లలోని నికోటిన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. మీరు స్మోకింగ్ మానేసిన కొద్ది రోజుల్లోనే గుండె పని తీరులో సానుకూల మార్పులను గమనించవచ్చు.

Also Read: ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా ? వీటితో ప్రాబ్లమ్ సాల్వ్

5.  ఆరోగ్య పరీక్షలు:
30 ఏళ్లు దాటిన వారు కనీసం ఏడాదికి ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు , కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా గుండె పోటును నివారించవచ్చు.

6. బరువు :
అధిక బరువు లేదా స్థూలకాయం గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. శరీర ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. నడుము చుట్టుకొలత పెరగడం అనేది గుండె జబ్బుల సంకేతం కావచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం ముఖ్యం.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×