E-Paper
Advertisement

మచ్చలు లేని మెరిసే చర్మం కావాలా? ఇంట్లోనే బాడీ స్క్రబ్ ఇలా చేయండి

మచ్చలు లేని మెరిసే చర్మం కావాలా? ఇంట్లోనే బాడీ స్క్రబ్ ఇలా చేయండి
Advertisement

Homemade Body Scrub| నేటి ఆధునిక జీవితంలో కాలుష్యం, ఒత్తిడి బిజీ షెడ్యూల్ వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటోంది. చర్మం నల్లబడడం, టానింగ్, ముడతలు, మొటిమలు వంటి సమస్యలు సాధారణమవుతున్నాయి. ఈ సమస్యల వల్ల అందవిహీనంగా కనిపించడంతో చాలా మంది ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ప్రతి ఒక్కరూ మెత్తగా, స్మూత్‌గా, మెరిసే చర్మం కోరుకుంటారు. కానీ అందుకు మార్కెట్‌లో లభించే క్రీములు ఖరీదైనవిగా ఉంటాయి. పార్లర్ వెళ్లాలంటే ఆ ఖర్చు కూడా భారీగా ఉంటుంది.

స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌‌ హానికరం

చాలా స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. పారాబెన్స్, సల్ఫేట్స్ వంటివి చర్మాన్ని పొడిబార్చి దెబ్బతీస్తాయి. ఇవి చాలా ఖరీదైనవి కూడా. నిరంతరం వాడటం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. అందుకే చాలా తక్కువ ఖర్చులో సహజ పరిష్కారాలు ఉన్నాయి. పైగా ఇవి సురక్షితమైనవి కూడా. చర్మానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి.

వంటగదిలో లభించే పదార్థాలతో సహజ చర్మ సంరక్షణ

Advertisement

వంటగదిలో ఉండే సాధారణ వస్తువులతోనే చర్మాన్ని మెరుగుపరచవచ్చు. అవి చర్మానికి హాని చేయకుండా సున్నితంగా పని చేస్తాయి. కాఫీ, చక్కెర, శనగపిండి వంటి పదార్థాలు చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగకరం. ఇవి చర్మాన్ని శుభ్రం చేసి, మృత కణాలు తొలగించి, పోషణ ఇస్తాయి. ఇవి చాలా చౌకగా, ఇంట్లోనే దొరుకుతాయి. వీటిలో కేవలం అయిదు నిమిషాల్లోనే బాడీ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు.

హోమ్‌మేడ్ బాడీ స్క్రబ్ కోసం కావాల్సిన పదార్థాలు

ఒక్క స్పూన్ చక్కెర, ఒక్క స్పూన్ డ్రై కొబ్బరి, ఒక్క స్పూన్ కొబ్బరి నూనె, ఒక్క స్పూన్ బాడీ వాష్, ఒక్క స్పూన్ కాఫీ పొడి, కొద్దిగా నిమ్మ తొక్క పొడి. ఈ పదార్థాలు అన్ని కలిపితే అద్భుతమైన సహజ స్క్రబ్ ఏర్పడుతుంది.

బాడీ స్క్రబ్ ఎలా తయారు చేయాలి?

Advertisement

ఒక శుభ్రమైన గిన్నెలో ముందు చక్కెర, డ్రై కొబ్బరి, కాఫీ పొడి వేయండి. తర్వాత కొబ్బరి నూనె, బాడీ వాష్ కూడా జోడించండి. చివరగా నిమ్మ తొక్క పొడి కలపండి. అన్నింటినీ బాగా కలిపి గట్టి పేస్ట్ లాగా చేసుకోండి. మీ హోమ్‌మేడ్ బాడీ స్క్రబ్ సిద్ధం.

స్క్రబ్‌ను సరిగ్గా ఎలా వాడాలి?

స్నానం చేసేటప్పుడు ఈ స్క్రబ్‌ను శరీరం అంతా సున్నితంగా పూయండి. చేతులతో గుండ్రంగాం మసాజ్ చేస్తూ 2-3 నిమిషాలు స్క్రబ్ చేయండి. మోచేతులు, మోకాళ్లు, మెడ వంటి ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడగండి.

Also Read: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? సహజంగా ఎత్తు పెరగడానికి ఈ ఆహారాలు తినిపించండి

ఈ స్క్రబ్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ స్క్రబ్ డెడ్ స్కిన్‌ను సులభంగా తొలగిస్తుంది. కొత్త, ఆరోగ్యకరమైన చర్మం బయటపడుతుంది. చర్మం మెత్తగా, స్మూత్‌గా మారుతుంది. సహజ తేమను కాపాడుతుంది. కాఫీ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. చక్కెర నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది. కొబ్బరి నూనె చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది. నిమ్మ తొక్క చర్మం మెరుగును పెంచుతుంది. వారానికి 1-2 సార్లు ఈ స్క్రబ్ వాడితే చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది.

ఇంట్లో తయారు చేసుకునే బాడీ స్క్రబ్ సురక్షితమైనది, తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు. హానికర కెమెకల్స్ లేకుండా సహజంగా చర్మానికి నిగారింపు ఇస్తుంది. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకొని నిరంతరం వాడండి.

 

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×