E-Paper
Advertisement

Vijayawada: ఆర్టీసీ ఛార్జీల సవరణ.. ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన

Vijayawada: ఆర్టీసీ ఛార్జీల సవరణ.. ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన
Advertisement

Vijayawada: ఏపీ నుంచి తెలంగాణ.. తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల బస్సులు తిరుగుతుంటాయి. ఛార్జీల ఎక్కువగా ఉండడంతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే ఆర్టీసీ బస్సుల ఛార్జీలను సవరించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కంటే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువ. దూరాన్ని బట్టి రూ.20 నుంచి రూ.130 వరకు ఆ బస్సుల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.

ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సులు.. ఛార్జీల సవరణ

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి. ప్రతీ రోజు వందల సంఖ్యలో ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ఏపీలో ఆర్టీసీ బస్సులకు.. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల్లో వ్యత్యాసం కనిపించింది. ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ దృష్టికి తెచ్చారు ప్రయాణికులు. ఏపీ-తెలంగాణ బస్సుల టారిఫ్‌లను ఏపీఎస్ ‌ఆర్టీసీ అధికారులు సవరణలు చేపట్టారు.

ఫలితంగా ఏపీ బస్సుల్లో మాదిరిగానే తెలంగాణ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ కన్నా టీజీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేసేవారు. ఫలితంగా రూ.20 నుంచి రూ.130 వరకు ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో వాటిని సవరించినట్లు తెలిపారు. బస్సు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచన చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.

Advertisement

సీనియర్ సిటిజన్, వికలాంగుల సీట్లకు సంబంధించి ఆర్టీసీ ఆదేశాలు

దీంతోపాటు ఏపీఎస్ ఆర్టీసీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రావడంతో బస్సుల సీట్లను మహిళలు అమాంతంగా కబ్జా చేస్తున్నారు. ఒకవేళ తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే తిరుగుబాటు చేస్తున్నారు. ఆపై దాడులకు దిగుతున్నారు. ఫలితంగా లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఈ విషయం కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.

దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బంది ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసింది. వారి కోసం కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా సిబ్బంది చూడాలని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు కూర్చునేలా చూడాలని సూచించారు.

ALSO READ: ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరినందుకు… ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌ పై టీడీపీ మాట‌ల దాడి…

ఆర్టీసీ అన్‌ రిజర్వ్‌డ్‌ బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి. రెండేసి సీట్లు చొప్పున రిజర్వ్‌ చేస్తారు. ఉచిత బస్సు నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగులను కూర్చోనివ్వలేదు చాలామంది ప్రయాణికులు. దీనిపై ఆర్టీసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. పరిస్థితి గమనించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు పైన వివరించిన ఆదేశాలు జారీ చేశారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×