E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో మీ ఇంటికి స్టైలిష్, లగ్జరీ లుక్.. సింపుల్‌గా ఈ మార్పులు చేయండి

తక్కువ బడ్జెట్‌లో మీ ఇంటికి స్టైలిష్, లగ్జరీ లుక్.. సింపుల్‌గా ఈ మార్పులు చేయండి
Advertisement

చాలా మంది తమ ఇంటిని కొంతకాలానికి ఒక్కసారి డెకరేషన్, హోం ఇంటీరియర్ మారుస్తుంటారు. దీని కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా లగ్జరీ లుక్ తీసుకురావచ్చు. ఇల్లు శుభ్రంగా ఉంటే అందంగా, కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. విరిగిన వస్తువులు, ఉపయోగం లేని ఫర్నీచర్ ను తొలగించాలి. ఇంట్లో తక్కువ సామాన్లు ఉంటే గదులు విశాలంగా, అందంగా కనిపిస్తాయని ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తారు. మరీ ఎక్కువ డెకరేషన్ గదిని చికాకుగా మారుస్తాయి. ఇంటి కోసం కొత్త ఫర్నీచర్ కొనే బదులు దాని స్థానాన్ని మార్చడం వల్ల కూడా ఇంటికి కొత్త లుక్ వస్తుంది.

న్యూట్రల్, సాఫ్ట్ కలర్స్ వాడండి

గోడ రంగులు ఇంటి లుక్ ను బాగా ప్రభావితం చేస్తాయి. తెలుపు, క్రీమ్, లైట్ గ్రే, పేస్టల్ షేడ్స్.. ప్రశాంతమైన లగ్జరీ లుక్ ఇస్తాయి. లైట్ కలర్స్ సహజమైన సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. దీనివల్ల చిన్న ఇళ్లు పెద్దవిగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

లైటింగ్ మెరుగుపరచండి

Advertisement

వెచ్చని లైటింగ్ సౌకర్యవంతమైన, ఎలిగెంట్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. టేబుల్ ల్యాంప్స్, పెండెంట్ లైట్లను సృజనాత్మకంగా వాడండి. సహజమైన కాంతి కోసం పగటిపూట కిటికీలను తెరిచి ఉంచండి. తేలికపాటి తెరలు సూర్యకాంతిని లోపలికి అనుమతిస్తాయి.

అద్దాలు, డెకరేషన్ వస్తువులు జోడించండి

అలంకరణ కోసం అద్దాలు పెట్టడం చిన్న ఇళ్లకు కొత్త లుక్ ఇచ్చేందుకు చాలా సులభమైన ట్రిక్. ఇవి కాంతిని ప్రతిబింబించి గదిని పెద్దదిగా చూపిస్తాయి. ఇండోర్ మొక్కలు, క్యాండిల్స్, దిండ్లు, కళాత్మక జాడీలను వాడండి. ఇత్తడి, రాగి లేదా కలప అలంకరణ వస్తువులు.. రిచ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Advertisement

Also Read: భార్యభర్తలు శారీరకంగా దూరంగా ఉంటే ఊబకాయం వస్తుందా?

కర్టెన్లు, ఫ్యాబ్రిక్స్‌ను అప్గ్రేడ్ చేయండి

ఫ్లోర్-లెంగ్త్ కర్టెన్లు హోటల్ స్టయిల్ లాంటి ఎలిగెన్స్ ఇస్తాయి. న్యూట్రల్ కర్టెన్లు.. ఎవర్ గ్రీన్ స్టయిలింగ్ కు మంచివి. దిండు కవర్లు, బెడ్ షీట్లు మార్చడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో మంచి మార్పు వస్తుంది.

ఇంటి లోపల ప్రకృతి ప్రతిబింబించాలి

ఇంట్లో ఎప్పుడూ ఫ్రెష్ లుక్ కోసం ఇండోర్ ప్లాంట్స్ ఇంటిని తాజాగా, సజీవంగా మారుస్తాయి. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ మంచి ఎంపికలు. వుడెన్ టెక్స్చర్లు, చేత్తో చేసిన డెకర్ ముక్కలు వెచ్చదనాన్ని జోడిస్తాయి. చిన్న ఆలోచనాత్మక మార్పులతో ఎక్కువ ఖర్చు  లేకుండానే ఇంటిని అందంగా మార్చుకోవచ్చు.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×