E-Paper
Advertisement

మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే వెబ్ సిరీస్ లు… ప్రతి సిరీస్ ఒక మాస్టర్ పీస్ భయ్యా

మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే వెబ్ సిరీస్ లు… ప్రతి సిరీస్ ఒక మాస్టర్ పీస్ భయ్యా
Advertisement

Best Fantasy series on OTT : ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడితే చాలు, కొన్ని ఫాంటసీ సిరీస్‌లు మనల్ని ఈ లోకం నుంచి వేరే లోకానికి తీసుకెళ్ళిపోతాయి. కళ్ళు అప్పగించి చూసేలా చేసే గ్రాఫిక్స్, ఊహకందని ట్విస్టులు, మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్లతో అబ్బురపరుస్తుంటాయి. అలాంటి మెదడుకు మేత పెట్టే ఆ టాప్ 5 ఫాంటసీ వెబ్ సిరీస్‌లపై ఓ లుక్ వేద్దాం. రొటీన్ సీరీస్ లను చూసి బోర్ కొడుతుంటే, వీటిని ఓ సారి ట్రై చెయ్యండి, మజా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.

1. A Knight of the Seven Kingdoms (2026)

‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ అంటే తెలియని సిరీస్ ప్రేమికుడు ఉండడు. ఆ ప్రపంచానికి వంద ఏళ్ల ముందు ఏం జరిగిందనే కథే ఇది. డ్రాగన్ల హడావుడి, పెద్ద పెద్ద యుద్ధాల కంటే కూడా.. నైట్, ఎగ్ అనే యోధుల చుట్టూ తిరిగే అడ్వెంచర్ ఇది. విజువల్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా ప్రతి సీన్ ఒక రేంజ్‌లో ఉంటుంది భయ్యా. JioHotstarలో దీనిని చూడవచ్చు.

2. House of the Dragon (2022)

Advertisement

టార్గేరియన్ వంశంలో రాజు పదవి కోసం ఒకరినొకరు నరుక్కునే కురుక్షేత్రమే ఈ సిరీస్. ఆకాశంలో ఎగిరే డ్రాగన్లు, వాటి మధ్య జరిగే ఫైట్లు చూస్తుంటే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రాజకీయం, వెన్నుపోట్లతో నడిచే ఈ ఫ్యామిలీ డ్రామా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫాంటసీ లవర్స్‌కి ఇది పండగ లాంటి సిరీస్. JioHotstarలో ఇది అందుబాటులో ఉంది.

3. His Dark Materials (2019–2022)

ఇదొక వింత ప్రపంచం భయ్యా. ఇక్కడ మనుషుల పక్కనే డెమన్స్ జంతువుల రూపంలో తిరుగుతుంటాయి. లైరా అనే అమ్మాయి మిస్సింగ్ అయిన తన ఫ్రెండ్‌ని వెతకడానికి బయలుదేరి, మల్టీవర్స్ రహస్యాలను ఎలా ఛేదించిందనేదే ఈ కథ. ఇందులో గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దీనిని కూడా JioHotstarలో చూడచ్చు.

4. The Dark Crystal: Age of Resistance (2019)

Advertisement

ఇది అడ్వాన్స్‌డ్ వీఎఫ్ఎక్స్ కాంబినేషన్‌లో వచ్చిన ఒక విజువల్ వండర్. ‘త్రా’ అనే గ్రహాన్ని క్రూరమైన స్కెక్‌సిస్ పాలన నుండి రక్షించడానికి ముగ్గురు గెల్ఫ్‌లింగ్‌లు చేసే పోరాటమే ఈ కథ. బొమ్మలతో ఇంతటి ఎమోషన్‌ని, ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించవచ్చా అని అబ్బురపడాల్సిందే దీనిని చూస్తున్నంత సేపు. Netflixలో ఇది అందుబాటులో ఉంది.

5. Kingdom (2019–2021)

జోంబీ సిరీస్‌లు చాలా చూసుంటారు, అయితే ఇది వేరే లెవెల్ మాస్. కొరియా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాజుకు ఒక వింత జబ్బు చేసి రాత్రి పూట జోంబీలా మారిపోతాడు. ఆ మహమ్మారి రాజ్యం మొత్తం పాకితే, యువరాజు తన ప్రజలను ఎలా కాపాడుకున్నాడనేదే ఈ రక్తం మరిగే యాక్షన్ డ్రామా. ఫాంటసీకి పొలిటికల్ థ్రిల్లర్ తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. ఇది Netflixలో అందుబాటులో ఉంది. ఫాంటసీ ప్రపంచంలో మునిగిపోవాలనుకుంటే వెంటనే ఈ వీకెండ్ వీటితో లాగించేయండి భయ్యా.

Read Also : ఇంటి కింద గుట్టలుగా పడి ఉన్న శవాలు… ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ట్రూ క్రైమ్ వెబ్ సిరీస్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×