E-Paper
Advertisement

కేవలం చదువు మాత్రమే కాదు పిల్లలకు డబ్బు విలువ కూడా నేర్పించాలి.. అందుకోసం తల్లిదండ్రులు చేయాల్సిందిదే

కేవలం చదువు మాత్రమే కాదు పిల్లలకు డబ్బు విలువ కూడా నేర్పించాలి.. అందుకోసం తల్లిదండ్రులు చేయాల్సిందిదే
Advertisement

పిల్లలు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు, స్నేహితుల, చుట్టూ ఉన్న పరిస్థితులు నుంచి నేర్చుకుంటారు. డబ్బు ఎంత విలువైనదో, దాన్ని ఎలా ఖర్చు చేయాలి? ఎలా ఆదా చేయాలి? అనే విషయాలు పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక బాధ్యత గురించి చెప్పడం చాలా అవసరం. చిన్న వయసులో నేర్చుకున్న ఈ విషయాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి.

ఈ రోజుల్లో పిల్లలు.. ఖరీదైన బొమ్మలు, గాడ్జెట్లు, ఫ్యాషన్ వస్తువులపై త్వరగా ఆకర్షితులవుతున్నారు. డబ్బు విలువ తెలియకపోతే భవిష్యత్తులో ఖర్చులను నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే చిన్నప్పటి నుంచే డబ్బు గురించి అవగాహన కల్పించాలి.

ముందుగా పొదుపు చేయడం నేర్పండి

Advertisement

చాలా మంది పిల్లలు చేతికి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేస్తారు. తల్లిదండ్రులు ముందుగా కొంత డబ్బు దాచుకోవాలని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పొదుపు అలవాటు పెరుగుతుంది.
పిల్లలకు చిన్న చిన్న సేవింగ్ టార్గెట్స్ ఇవ్వాలి. వారు దాచుకున్న డబ్బుతో ఏదైనా కొనుగోలు చేస్తే సంతోషంగా ఫీలవుతారు. దీని వల్ల ఓర్పు, క్రమశిక్షణ నేర్పుతుంది.
పిగ్గీ బ్యాంక్ లేదా చిన్న సేవింగ్ బాక్స్ ఉపయోగించడం కూడా మంచి అలవాటు. ప్రతిరోజూ కొద్దిగా సేవ్ చేయడం జీవితాంతం ఉపయోగపడుతుంది.

అవసరం, కోరిక మధ్య తేడా చెప్పండి

పిల్లలు టీవీల్లో చూసే ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు చూసి లేదా స్నేహితుల వద్ద ఉన్న వస్తువులు చూసి అలాంటివే అడుగుతారు. తల్లిదండ్రులు అవసరం, కోరిక మధ్య తేడా వివరించాలి. ఆహారం, చదువు, దుస్తులు అవసరాలు. ఖరీదైన గాడ్జెట్లు, ఫ్యాషన్ వస్తువులు కోరికలు మాత్రమే. ఈ తేడా అర్థమైతే పిల్లలు ఆలోచించి ఖర్చు చేయడం నేర్చుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించగలుగుతారు.

డబ్బు కావాలంటే ఓర్పు, వేచి ఉండడం నేర్పండి

Advertisement

ఈ రోజుల్లో తల్లిదండ్రులు.. పిల్లలకు అడిగిన ప్రతి వస్తువు కొనిస్తున్నారు. కానీ ప్రతి వస్తువు జీవితంలో కోరకున్న వెంటనే దొరకదు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఏదైనా వస్తువు కావాలంటే అది లభించే వరకు ఎదురు చూడాల్సి వస్తుందని నేర్పాలి.
తమకు కావాల్సిన వస్తువు కోసం డబ్బు దాచుకోవాలని ప్రోత్సహించాలి. ఇలా చేస్తే కష్టపడి సంపాదించిన దాని విలువ అర్థమవుతుంది. ఈ అలవాటు భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే శక్తినిస్తుంది.

ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పండి

చాలా కుటుంబాల్లో.. డబ్బు విషయాలు పిల్లలతో మాట్లాడరు. కానీ చిన్న చిన్న బడ్జెట్ విషయాలు చెప్పడం మంచిది. ఇంటి ఖర్చులు ఎలా ఉంటాయో వివరించాలి.
ఇలా చెప్పడం వల్ల డబ్బు పరిమితమని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఖర్చు చేసే ముందు ఆలోచించే అలవాటు వస్తుంది. షాపింగ్ సమయంలో ధరలు పోల్చడం కూడా పిల్లలకు నేర్పాలి. ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

సేవింగ్స్‌తో పాటు సహాయం చేయడం కూడా నేర్పండి

డబ్బు గురించి చెప్పేటప్పుడు సేవింగ్స్ మాత్రమే కాదు, దానం కూడా నేర్పాలి. అవసరమైన వారికి సహాయం చేయడం మంచి అలవాటు. పిల్లలు కొంత డబ్బు దానం చేయడం ద్వారా దయ, బాధ్యత నేర్చుకుంటారు. డబ్బు కేవలం మన అవసరాలకే కాదు, ఇతరుల సహాయానికి కూడా ఉపయోగపడాలని అర్థమవుతుంది.

Also Read: ఉద్యోగం, బిజినెస్‌లో తరుచూ నష్టం వస్తోందా?వాస్తు ప్రకారం ఈ చెడు అలవాట్లే కారణం

తల్లిదండ్రులే మంచి ఉదాహరణ కావాలి

పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అనవసర కొనుగోళ్లు తగ్గించాలి. బడ్జెట్, సేవింగ్స్, ఖర్చుల గురించి ఇంట్లో మాట్లాడాలి. మంచి ఆర్థిక అలవాట్లు పిల్లల భవిష్యత్తును బలంగా తయారుచేస్తాయి.

డబ్బు నిర్వహణ ప్రతి పిల్లవాడికి అవసరమైన జీవిత నైపుణ్యం. చిన్నప్పటి నుంచే సరైన ఆర్థిక అలవాట్లు నేర్పితే పిల్లలు బాధ్యతాయుతంగా ఎదుగుతారు. మంచి డబ్బు అలవాట్లు వారి భవిష్యత్తును సురక్షితంగా మారుస్తాయి.

చిన్నప్పుడే డబ్బు నిర్వహణ నేర్పించడం వల్ల పిల్లలు.. భవిష్యత్తులో తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వారికి.. రుణాలు, అనవసర ఖర్చుల నుంచి కాపాడుతుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×