E-Paper
Advertisement

Ramiz Raja: అల్లా మీద ఒట్టు..రెండు రోజుల్లో పాకిస్తాన్‌ 437 ప‌రుగులు కొట్ట‌లేదు..రాసిపెట్టుకోండి

Ramiz Raja: అల్లా మీద ఒట్టు..రెండు రోజుల్లో పాకిస్తాన్‌ 437 ప‌రుగులు కొట్ట‌లేదు..రాసిపెట్టుకోండి
Advertisement

Ramiz Raja:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఒక వైపు కొన సాగుతున్న నేపథ్యంలో మరోవై పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Bangladesh vs Pakistan, 2nd Test) మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తరంగా జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్… రెండో టెస్టులో కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండో టెస్టులో పాకిస్తాన్ ముందు ఏకంగా 437 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది బంగ్లాదేశ్.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

అల్లా మీద ఒట్టు..పాకిస్తాన్‌ 437 ప‌రుగులు కొట్ట‌లేదు..రాసిపెట్టుకోండి

Advertisement

రేపు ఎల్లుండి అంటే రెండు రోజుల్లో ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదించాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ టార్గెట్ రీచ్ కావడం గగనమని చెబుతున్నారు. లేటెస్ట్ గా రమీజ్ రాజా (Ramiz Raja) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అల్లా ( Allah) మీద ఒట్టు.. రెండు రోజుల్లో 437 పరుగులు చేయడం పాకిస్తాన్ క్రికెట్ జట్టు వల్ల కాదని బాంబు పేల్చారు. ఒకవేళ పాకిస్తాన్ చేజ్ చేస్తే… దేనికైనా సిద్ధమే అంటూ సవాల్ కూడా విసిరారు రమీజ్ రాజా. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పాకిస్తాన్ ముందు కొండంత టార్గెట్

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 2nd Test) మధ్య సిల్హెట్ ( Sylhet International Cricket Stadium, Sylhet)  వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ ముందు 437 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. అంతకుముందు బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు సాధించి ఆల్ అవుట్ అయింది. ఇటు పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 232 కు అలౌట్ అయిన క్రమంలో… 437 పరుగులు టార్గెట్ చేదించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Advertisement

రెండు రోజుల్లో 437 పరుగులు చేయలేదని పాకిస్తాన్ జట్టుపై దారుణంగా ట్రోలింగ్ చేశారు రమీజ్ రాజా. అల్లా దిగివచ్చిన కూడా ఇది సాధ్యం కాదని తెలిపారు. అయితే బాబర్ ఆజం టచ్ లోకి వచ్చి… మహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, సల్మాన్ అలీ ఇలాంటి ప్లేయర్లు రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. కానీ బాబర్ ఆజం ఒక్కడే రానించి.. మిగతా ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు రమీజ్ రాజా అంచనా వేశారు. అందుకే 437 పరుగులు సాధించడం పాకిస్తాన్ వల్ల కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అంటే ఈ లెక్కన బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సొంతం చేసుకోబోతుందన్నమాట.

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

 

https://www.facebook.com/photo/?fbid=1336604738571552&set=a.438150981750270

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×