E-Paper
Advertisement

అమ్మాయి కోసం రాక్ స్టార్ గా మారే కుర్రాడు… ఎవర్నైనా ప్రేమలో పడేసే మ్యూజికల్ లవ్ స్టోరీ

అమ్మాయి కోసం రాక్ స్టార్ గా మారే కుర్రాడు… ఎవర్నైనా ప్రేమలో పడేసే మ్యూజికల్ లవ్ స్టోరీ
Advertisement

Musical comedy Drama on OTT :ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు చెపుకోబోయే సినిమాను చూడాల్సిందే. ఇది 1980ల నాటి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇంట్లో అమ్మానాన్నల రోజూవారీ గొడవలు, కొత్తగా చేరిన స్కూల్లో పోకిరిగాళ్ల టార్చర్‌తో విసిగిపోయిన ఒక మిడిల్ క్లాస్ పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. తాను మనసుపడ్డ పిల్లను పడేయడానికి ఈ పిల్లాడు పడే తిప్పలు మామూలుగా ఉండవు. ఏకంగా ఒక మ్యూజిక్ బ్యాండ్ నే పెట్టాల్సి వస్తుంది. అతనికి సపోర్ట్ ఇచ్చే అన్నయ్య, ఆ బ్యాండ్ దోస్తుల హంగామా చూస్తుంటే భలే కిక్కెక్కుతుంది. ఇది లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, లైఫ్‌లో ఏదైనా సాధించాలనే కసిని పెంచే సినిమా. దీన్ని చూసాక ప్రతి ఒక్కరికీ మనం కూడా లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలిరా భై అనే ఊపు వస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2016లో వచ్చిన ఈ ఐరిష్ మ్యూజికల్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘సింగ్ స్ట్రీట్’ (Sing Street). దీనికి జాన్ కార్నీ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కేవలం $4 మిలియన్ల చిన్న బడ్జెట్‌తో నిర్మించగా, $14 మిలియన్ల వసూళ్లను సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘బెస్ట్ మోషన్ పిక్చర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే ఐరిష్ ఫిల్మ్ అవార్డ్స్ లో కానర్ అన్నయ్యగా నటించిన జాక్ రేనోర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకోగా, సినిమాలోని ప్రముఖ సాంగ్ “Drive It Like You Stole It” క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ఉత్తమ పాటగా నామినేట్ అయింది. ఈ సినిమా వెనుక ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది దర్శకుడు జాన్ కార్నీ నిజ జీవిత అనుభవాల ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఇది ఆపిల్ టివి, ప్రైమ్ విడియోలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1985లో ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో జరుగుతుంది. హీరో కానర్ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో, అతని తల్లిదండ్రులు అతన్ని ఫీజు తక్కువగా ఉండే ఒక మామూలు లోకల్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ కొత్త స్కూల్లో వాతావరణం అంతా చాలా రఫ్‌గా ఉంటుంది. పైగా స్టూడెంట్స్ అందరూ కానర్‌ను ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి టైమ్‌లో స్కూల్ బయట స్టైలిష్‌గా నిలబడి ఉన్న రఫినా అనే అమ్మాయిని చూసి కానర్ ఫ్లాట్ అయిపోతాడు. ఆమె ఒక మోడల్ అని తెలిసి, ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో నేను ఒక మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తున్నాను, మా కొత్త సాంగ్ వీడియోలో మోడల్‌గా నటిస్తావా? అని అప్పటికప్పుడు ఒక అబద్ధం చెప్పేస్తాడు ఆమెతో. ఆమె దానికి ఓకే అనడంతో కానర్‌కు ఏం చేయాలో అర్థం కాదు.

ఇచ్చిన మాట కోసం కానర్ స్కూల్లో ఉన్న కొందరు ఫ్రెండ్స్‌ని పోగు చేసి నిజంగానే ఒక బ్యాండ్ స్టార్ట్ చేస్తాడు. అతని అన్నయ్య బ్రెండన్ ఇచ్చిన సలహాలతో, 80ల నాటి పాప్, రాక్ మ్యూజిక్ ఇన్‌స్పిరేషన్‌తో సొంతంగా పాటలు రాయడం, ట్యూన్స్ కట్టడం మొదలుపెడతాడు. ఇక రఫినాతో కలిసి వీడియో షూట్స్ చేస్తూ, ఆమెతో ప్రేమలో పడతాడు. ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, స్కూల్లో టెన్షన్స్ ఉన్నప్పటికీ, ఈ మ్యూజిక్ బ్యాండ్ ద్వారా కానర్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. చివరకు రఫినాతో కలిసి తన కలలను నిజం చేసుకోవడానికి, కెరీర్‌లో ముందుకు వెళ్లడానికి లండన్ నగరానికి ప్రయాణమవడంతో ఈ అందమైన కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : జైలు నుంచే క్రైమ్స్ సాల్వ్ చేసే ఖైదీ… నాలుగు ఎపిసోడ్లతో బుర్ర హీటెక్కిస్తున్న కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×