E-Paper
Advertisement

కెమికల్స్, పొగ లేకుండా దోమలను ఇంటి నుంచి తరిమేయండి.. ఆరోగ్యానికి మేలు చేసే నేచురల్ టెక్నిక్

కెమికల్స్, పొగ లేకుండా దోమలను ఇంటి నుంచి తరిమేయండి.. ఆరోగ్యానికి మేలు చేసే నేచురల్ టెక్నిక్
Advertisement

Natural Remedies to Keep Mosquitoes Away| దోమలు చిన్న జీవులు.. కానీ ప్రమాదకరమైన కీటకాలు. దోమల కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. చాలా మంది దోమల నివారణ కోసం కెమికల్స్ కలిగిన రెపెల్లెంట్స్, స్ప్రేలు, కాయిల్స్, వినియోగిస్తున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేసి, ఊపిరితిత్తుల సమస్యలు కలిగిస్తాయి. సహజమైన పద్ధతులు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి.

కెమికల్ లిక్విడ్స్ వద్దు

కెమికల్ రిపెల్లెంట్లు హానికరమైన పొగ, విష వాయువులను విడుదల చేస్తాయి. ఇవి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి, చికాకు కలిగిస్తాయి. పిల్లలు వృద్ధులు ఈ ప్రభావాలకు ఎక్కువగా గురవుతారు. సహజమైన పరిష్కారాలు ఇంట్లో రోజువారీ ఉపయోగించడానికి చాలా సురక్షితం.

లెమన్‌గ్రాస్‌తో సహజ రక్షణ

Advertisement

లెమన్‌గ్రాస్ ఒక నేచురల్, పవర్‌ఫుల్ దోమల కిల్లర్. ఇందులో ఉండే సిట్రల్ పదార్థం, దోమలను దూరం చేస్తుంది. సిట్రల్‌లోని ఘాటు వాసన గాలిలో వ్యాపించి కీటకాలను తరిమేస్తుంది. కిటికీలు లేదా తలుపుల దగ్గర లెమన్‌గ్రాస్ మొక్కలు ఉంచండి. లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను కూడా బాగా ఉపయోగపడుతుంది.

దోమలను తరిమికొట్టే సిట్రోనెల్లా మొక్క 

సిట్రోనెల్లా దోమలను తరిమేసే గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని బలమైన సువాసన దోమలను గందరగోళానికి గురి చేసి, మనుషుల వాసనను గుర్తించకుండా చేస్తుంది. సిట్రోనెల్లా నూనెను సహజ రిపెల్లెంట్లలో ఎక్కువగా వాడతారు. ఇంటి లోపల లేదా బాల్కనీలో సిట్రోనెల్లా మొక్కలు ఉంచండి.

దోమ నియంత్రణకు తులసి మొక్క

Advertisement

భారీతీయ ఇళ్లలో తులసి సాధారణంగా లభిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు చాలా ఉపయోగకరం. దీని వాసన చుట్టుపక్కల ఉండే దోమలను దూరం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. తులసి వాసనకు దోమల లార్వా పురుగులు (పిల్ల దోమలు) కూడా చనిపోతాయి. తలుపులు లేదా కిటికీల దగ్గర తులసి మొక్కలు ఉంచండి.

సహజ నూనెలు, స్ప్రేలు ఉపయోగించండి

ఎసెన్షియల్ ఆయిల్స్ సహజ రిపెల్లెంట్లుగా పని చేస్తాయి. లెమన్ యూకలిప్టస్ నూనె దోమలకు బలమైన రక్షణ ఇస్తుంది. వేప నూనె, లావెండర్ నూనె కూడా కీటకాలను తరిమేస్తాయి. ఈ నూనెలను నీటితో కలిపి ఇంటి చుట్టూ స్ప్రే చేయవచ్చు.

వెల్లుల్లి, కర్పూరం పరిష్కారాలు

వెల్లుల్లి ఘాటు వాసన దోమలకు అయిష్టం. వెల్లుల్లిని నీళ్లలో మరిగించి గదుల్లో స్ప్రే చేయవచ్చు. కర్పూరం కూడా చాలా ప్రభావవంతమైనది. దీని వాసన రక్షణ కవచం ఏర్పరుస్తుంది. ఈ పరిష్కారాలు చాలా సులభం, సులభంగా ఉపయోగించవచ్చు.

పరిసరాలు శుభ్రంగా ఉంచండి

దోమలు ఒకే చోట నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. ఉదాహరణకు కూలర్, చెట్ల కుండీలలో నీరు చాలా రోజులుగా నిల్వ ఉంటే వాటిలో దోమలు గుడ్లు పెడతాయి. అందుకే ఆ నీరు తొలగిస్తే వాటి పెరుగుదల ఆగిపోతుంది. పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. పూతలు లేదా పాత్రల్లో నీరు నిలవకుండా చూడండి. ఇది దోమల సంఖ్యను సహజంగా తగ్గిస్తుంది.

దోమలు తరిమే మొక్కలు

లావెండర్, పుదీనా, రోజ్‌మేరీ వంటి మొక్కలు దోమలను తరిమేస్తాయి. ఈ మొక్కలు విడుదల చేసే వాసనకు దోమలు పారిపోతాయి. అందుకే వీటిని ఇంటి లోపల లేదా బయట ఉంచడం వల్ల దోమలు ఇంట్లో రాకుండా చేస్తాయి.

Also Read: మీ గోర్లపై కనిపించే గుర్తులు ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఇంట్లో గాలి ప్రసరణ బాగుండాలి

గాలి బాగా వీచే ప్రదేశాల్లో దోమలు సులభంగా ఎగరలేవు. ఫ్యాన్‌లు వాడడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి. సరైన వెంటిలేషన్ ఉన్న ఇళ్లలో దోమలు రావు. చీకటి గదుల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి.

దోమల నియంత్రణ కోసం సహజ పద్ధతులు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. మొక్కలు, నూనెలు, సులభ పరిష్కారాలతో మీ ఇంటిని రక్షించుకోండి. హానికరమైన రసాయనాలను మాని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచండి. ఈ చిన్న చిన్న చిట్కాలతో వ్యాధులను నివారించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×