BRS vs TRS: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన టీఆర్ఎస్ అనే మూడక్షరాల పేరు.. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్‌కు దారితీసింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడం, గులాబీ దళం అధికారాన్ని కోల్పోవడంతో.. మళ్లీ పాత బ్రాండ్ వైపే చూస్తున్నారు. అయితే, పేరు కోసం కేటీఆర్, కవిత మధ్య పోటీ నడుస్తోంది. బీఆర్ఎస్‌ని మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ చెబుతున్నారు. పార్టీ పేరు మార్చాక.. రాజకీయం నష్టపోయామని, బీఆర్ఎస్ పేరుని తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి చెప్పారు. ఈ విషయాన్ని, కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, తుది నిర్ణయం కేసీఆర్‌దే అన్నారు. అయితే, ప్రస్తుతం టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉందని, ఎవరైనా దానిని పెట్టుకోవచ్చని.. కవిత ఇటీవలే చెప్పారు. దాంతో.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయ్.
పాలిటిక్స్‌లో సెంటిమెంట్‌కి మించిన ఆయుధం మరొకటి లేదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ బ్రాండ్ బలంగా నాటుకుపోయింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటం వల్ల.. ప్రాంతీయ భావోద్వేగాలను తట్టిలేపుతుంది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత.. పార్టీ తన మౌలిక సిద్ధాంతమన తెలంగాణ వాదం నుంచి పక్కకు జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. గులాబీ క్యాడర్ కూడా.. ఇప్పటికీ తమని తాము టీఆర్ఎస్ వాదులమనే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. దాంతో.. ఎలాగైనా సరే రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పదానికి ఉన్న బ్రాండ్ వాల్యూని వాడేసుకోవాలని కేటీఆర్, కవిత డిసైడ్ అయ్యారు. తాను పెట్టబోయే కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని వచ్చేలా పేరు పెట్టాలని కవిత ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ బ్రాండ్‌తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని కేటీఆర్ చూస్తున్నారు. అలా.. తెలంగాణ పొలిటికల్ కాన్వాస్‌పైకి టీఆర్ఎస్ వచ్చిపడింది.
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష.. ఇప్పుడు నెరవేరేలా కనిపించడం లేదు. అందుకే, తిరిగి రాష్ట్రంపై పట్టు సాధించాలంటే బీఆర్ఎస్‌కు మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు మార్చడం ద్వారా పాత వైభవాన్ని, పోరాట పటిమని తిరిగి తేవొచ్చనే అభిప్రాయాలున్నాయి. పార్టీ నేతల్లోనూ, క్యాడర్‌లోనూ ఇదే అభిప్రాయం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మరోవైపు.. కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు.. టీఆర్ఎస్ అని పిలిచేలా కొత్త వేదికను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం.. కవిత ఈ పేరుని వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బీఆర్ఎస్ నిజంగానే మళ్లీ తన పాత బ్రాండ్ టీఆర్ఎస్‌ని అడాప్ట్ చేసుకుంటుందా? లేదా? అనేదే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.
Also read: సీఎం రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ సంచలన కామెంట్స్!
పేరు మార్పుపై ఫైనల్ డెసిషన్ కేసీఆర్‌దేనని.. కేటీఆర్‌తో పాటు పార్టీ నేతలంతా చెబుతున్నారు. గులాబీ దళపతి కేసీఆర్.. మరోసారి పార్టీ పేరు మార్పుకు ఒప్పుకుంటారా? కీలక నిర్ణయం తీసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. ఒకవేళ, కేసీఆర్ గనక బీఆర్ఎస్‌ని.. టీఆర్ఎస్ అని మార్చాలనుకుంటే.. నేషనల్ పాలిటిక్స్ నుంచి కొంత దూరం జరగాలని డిసైడ్ అయ్యారని భావించాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా, రాజకీయంగా చూసుకున్నా.. టీఆర్ఎస్ బ్రాండ్‌పై పూర్తి హక్కులు కేసీఆర్‌కే ఉంటాయ్. బీఆర్ఎస్ అనేది.. టీఆర్ఎస్ రూపాంతరం మాత్రమే. కాబట్టి, పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మళ్లీ పేరు మార్పు తీర్మానం చేస్తే.. అదే పార్టీకి చెందుతుంది. అయితే, ఈ పేరు చుట్టూ ఉన్న సెంటిమెంట్‌ని ఆమె ఎంతవరకు క్యాష్ చేసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.
టీఆర్ఎస్ పేరు మళ్లీ తెరమీదికి వస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలను ఎదుర్కొనేందుకు.. తెలంగాణ ఆత్మగౌరవం అనే పాత ఆయుధాన్ని వాడేందుకు, టీఆర్ఎస్ పేరుని వాడుకునే అవకాశం ఉంది. పేరు మార్పుతో.. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ రావడం ఖాయమంటున్నారు. ఏదేమైనా.. రాజకీయాల్లో పేర్లు మారినంత మాత్రాన.. పార్టీల రాతలు మారిపోవనేది వాస్తవం. అయినా, టీఆర్ఎస్ అనేది తెలంగాణ పాలిటిక్స్‌లో ఓ బ్రాండ్. ఆ బ్రాండ్‌ని తిరిగి తెచ్చుకోవడం ద్వారా కేసీఆర్ పార్టీకి గత వైఐభవం వస్తుందా? లేక.. ఇది కేవలం ఓ రాజకీయ ఎత్తుగడగానే మిగిలిపోతుందా? అనేది కాలమే డిసైడ్ చేయాలి.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరమైన మలుపులో ఉంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనే చర్చ.. కేవలం పేరు మార్పు గురించే కాదు. అదొక పార్టీ ఉనికికి, అస్తిత్వానికి సంబంధించిన కీలక పరిణామంగా కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌ని తిరిగి రగిలించడం ద్వారా, పూర్వ వైభవాన్ని పొందాలని గులాబీ దళం భావిస్తోంది. ఇందులో.. సెంటిమెంట్‌తో పాటు స్ట్రాటజీ కూడా దాగుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి జనంలో టీఆర్ఎస్ అనే పేరు బలంగా నాటుకుపోయింది. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత.. గులాబీ పార్టీ తన ప్రాంతీయ మూలాలను కోల్పోయిందనే అభిప్రాయం.. చాలా మంది ఓటర్లలో కలిగింది. టీఆర్ఎస్ అనే పేరు వినబడగానే ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం గుర్తొస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రాష్ట్రంలోని రెండు జాతీయ పార్టీలను ఢీకొట్టాలంటే.. మళ్లీ ఆ తెలంగాణ బ్రాండ్ అవసరమని గులాబీ కేడర్ బలంగా నమ్ముతోంది. పేరు మార్పు జరిగితే, కోల్పోయిన ఓటు బ్యాంకుని తిరిగి రాబట్టుకోవచ్చనేది.. పార్టీ ఇన్‌సైడ్ టాక్.
Also Read: సమ్మేకు సిద్దమైన ఆర్టీసీ.. అర్ధరాత్రి నుంచి చక్రం తిప్ప బోమంటున్న జేఏసీ!
కేటీఆర్ కూడా ప్రజల్లోకి వెళఅలేందుకు.. పాదయాత్రని ఎంచుకున్నారు. ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. పదేళ్ల కాలంలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, దానిని తగ్గించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన కొన్ని లోపాలను కేసీఆర్ బహిరంగంగానే అంగీకరించారని కూడా అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో.. తాము ఫెయిలయ్యామని కేటీఆర్ ఒప్పుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కొన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో.. ఇలాంటి లోపాలు తలెత్తాయన్నారు. వీటన్నింటిని దాటి, మళ్లీ జనానికి దగ్గరయ్యేందుకు కేటీఆర్ పాదయాత్ర అస్త్రాన్ని ఎంచుకున్నారు. నడక మొదలుపెడితే.. పార్టీకి ప్రజల్లో మైలేజ్ వస్తుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలు, ఐటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంలో.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కేసీఆర్ వారసుడిగా కాకుండా, స్వతంత్రంగా ప్రజా నాయకుడిగా తనని తాను నిరూపించుకోవాలని కేటీఆర్ ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఓటర్లు కూడా ఓ డిసైడింగ్ ఫ్యాక్టర్., ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేపట్టాలనే ఆలోచన వెనుక లోతైన రాజకీయం దాగుంది. దాని లెక్కలు వేరే ఉన్నాయ్. గత ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి హామీలతో.. మహిళా ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత తన పాదయాత్ర ద్వారా మహిళలతో నేరుగా మమేకమై, ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. హామీల అమలులో ఆలస్యాన్ని మహిళలకు వివరించి, కాంగ్రెస్ పట్టుని సడలించాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. కవిత గనక పాదయాత్ర మొదలుపెడితే.. ఎవరికి నష్టం చేస్తుందన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కాకపోతే, గ్రామీణ ప్రాంతాల్లో గకన మహిళల మద్దతు కూడగట్టగలిగితే, అది అధికార, ప్రతిక్ష పార్టీలకు పెద్ద సవాల్‌గా మారుతుంది.
బీఆర్ఎస్‌ని.. తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం, పాదయాత్రల లాంటివి.. పార్టీకి కొంత ఆక్సిజన్ అందించే అవకాశం ఉన్నా, కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయ్. ఎందుకంటే, రాజకీయాల్లో వ్యూహంతో పాటు.. టైమింగ్ కూడా ముఖ్యమే. టీఆర్ఎస్ బ్రాండ్ మళ్లీ రీఎంట్రీ ఇస్తే.. ఆ మార్పుని జనం ఎంతవరకు ఓన్ చేసుకుంటారనేది కూడా ఇంట్రస్టింగే. కేవలం, సెంటిమెంట్ కోసమో, క్యాడర్‌లో జోష్ నింపడం కోసమో కాకుండా ప్రజా సమస్యలపై ఆ పార్టీ స్పందించే తీరుపైనే జనం మద్దతు ఆధారపడి ఉంటుంది. టీఆర్ఎస్ బ్రాండ్‌తో కేటీఆర్, కవిత పాదయాత్రలతో ప్రజల్లోకి వెళితే.. అది కచ్చితంగా రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రత్యర్థి పార్టీల దూకుడుని తట్టుకొని ఈ టీ బ్రాండ్ ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తి రేపుతోంది.
Also Read: గులాబీ దళం రివర్స్ గేర్.. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే ఆలోచనలో కేసీఆర్..?