Curly Hairstyle Tips | చాలా మంది మహిళలు ఒకే తరహా హెయిర్ స్టైల్ బోర్ కొట్టేసిందని కొత్త స్టైల్ మార్చుకోవడానికి ఇష్టపడతారు. కొందరు స్ట్రెయిట్ హెయిర్ ఇష్టపడితే, మరికొందరు రింగుల జుట్టు (కర్లీ హెయిర్)ని ఎక్కువగా ఇష్టపడతారు. కర్లీ హెయిర్ సహజంగా ముఖానికి అందం చేస్తాయి. అలాగే జుట్టుకు మరింత ఒత్తుగా కనిపిస్తుంది. సహజంగా రింగులజుట్టు ఉన్నవారికి స్టైలింగ్ సులభం. కానీ స్ట్రెయిట్ జుట్టు ఉన్నవారు కూడా ఇంట్లోనే ఈజీగా జుట్టుకు కర్ల్స్ చేసుకోవచ్చు. దీని కోసం ఖరీదైన సెలూన్ ట్రీట్‌మెంట్లు అవసరం లేదు.
తలస్నానం చేసి లేదా జుట్టు వాష్ చేసి కొంచెం తడిగా ఉంచండి. జుట్టు సరిగ్గా విభజించండి. బ్లో డ్రైయర్‌తో జుట్టు విభాగాలను లోపలికి తిప్పుతూ ఆరబెట్టండి. ఇలా చేస్తే సాఫ్ట్, నేచురల్ కర్ల్స్ వస్తాయి. ఇందుకోసం స్ట్రెయిట్‌నర్ ఉపయోగించి కూడా లూజ్ వేవ్స్ చేయవచ్చు. స్ట్రెయిట్‌నర్‌ను తిప్పుతూ జుట్టు క్రిందికి తీసుకురావడం వల్ల అందమైన వేవ్స్ వస్తాయి. అవసరమైతే బాబీ పిన్స్ ఉపయోగించి కర్ల్స్‌ను ఫిక్స్ చేయండి. స్టైల్ ఎక్కువ సేపు ఉండాలంటే.. లైట్ హెయిర్ స్ప్రే అప్లై చేయండి.
హెయిర్ రోలర్స్ ఉపయోగిస్తే సరైన భాగాలుగా కర్ల్స్ సులభంగా వచ్చేస్తాయి. జుట్టు సైజు చిన్నది ఉన్నా లేదా టైట్ కర్ల్స్ కావాలంటే చిన్న రోలర్స్ ఉపయోగించండి. పొడవైన జుట్టు లేదా లూజ్ వేవ్స్ కావాలంటే పెద్ద రోలర్స్ ఉపయోగించండి. జుట్టు కొంచెం తడిగా ఉండగా రోలర్స్ పెట్టండి. బ్లో డ్రైయర్ ఉపయోగించి రోలర్స్‌ను ఫిక్స్ చేయవచ్చు. కొంత సేపు ఉంచి తీసేస్తే అందమైన, ఒత్తుగా ఉన్న కర్ల్స్ వస్తాయి.
హీట్ టూల్స్ లేకుండా కూడా కర్ల్స్ చేసుకోవచ్చు. జుట్టును బాగా విడదీసి చిన్న చిన్న విభాగాలుగా విభజించండి. ప్రతి విభాగాన్ని గట్టిగా జడ వేసి రాత్రి నిద్రపోయేముందు వదిలేయండి. ఉదయం జడ విప్పేస్తే సాఫ్ట్, నేచురల్ కర్ల్స్ వస్తాయి. ఫోమ్ రోలర్స్ కూడా హీట్ లేకుండా మంచి కర్ల్స్ ఇస్తాయి.
Also Read: మీ పిల్లాడు సరిగా చదువుకోవడం లేదా? పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడానికి ఈ ట్రిక్స్ పాటించండి
కర్ల్స్ ఎక్కువ సేపు ఉండాలంటే సరైన సంరక్షణ అవసరం. కర్ల్స్ చేసిన తర్వాత జుట్టును తరచుగా దువ్వడం చేయకూడదు. తరచూ దువ్వితే కర్ల్స్ వదులైపోతాయి. లైట్ హెయిర్ స్ప్రే ఉపయోగించి కర్ల్స్‌ను ఫిక్స్ చేయండి. జుట్టుకు నూనె, హెయిర్ మాస్క్ వేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి. కండీషనర్ రెగ్యులర్‌గా వాడటం వల్ల జుట్టు డ్రై అవ్వదు.
ఇంట్లోనే సులభంగా, తక్కువ ఖర్చుతో కర్లీ హెయిర్ చేసుకోవచ్చు. హీట్ టూల్స్ ఉపయోగించి లేదా హీట్ లేకుండా కూడా కర్ల్స్ చేయవచ్చు. సరైన సంరక్షణతో కర్ల్స్ ఎక్కువ సేపు అందంగా ఉంటాయి. అన్ని పద్ధతులు ప్రయత్నించి మీకు సరిపడే విధానాన్ని ఎంచుకోండి.