E-Paper
Advertisement

ఫ్రిజ్‌లో ప్రియురాలి శవం.. విశాఖలో నేవీ ఉద్యోగి ఘాతుకం, చంపిన తర్వాత అలా చేసి..

ఫ్రిజ్‌లో ప్రియురాలి శవం.. విశాఖలో నేవీ ఉద్యోగి ఘాతుకం, చంపిన తర్వాత అలా చేసి..

Vizag Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా హత్యలు చేసుకునే ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన విశాఖ సిటీలో వెలుగులోకి వచ్చింది. ప్రియురాల్ని ఇంటికి పిలిచి ఆపై ముక్కలు చేశాడు ఆమె ప్రియుడు. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాడు. నేరుగా పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. అసలేం జరిగింది?

విశాఖలో దారుణం.. ప్రియురాల్ని చంపిన నేవీ ఉద్యోగి

స్థానికులు.. పోలీసుల సమాచారం మేరకు.. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన 35 ఏళ్ల రవీంద్ర నేవీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం గాజువాకలోని ఎల్‌బీనగర్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే రవీంద్రకు వివాహం జరిగింది. కొద్దిరోజులుగా అతడి భార్య విజయనగరంలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత భర్త దగ్గరకు మళ్లీ రాలేదు. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే.

ఇంక రెండోవైపుకి వద్దాం. విశాఖలోని సాలగ్రామపురానికి చెందిన 29 ఏళ్ల మౌనిక‌తో రవీంద్రకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ షిప్‌కి దారి తీసిందని స్థానికులు చెబుతున్నమాట. ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్‌కి పిలిచాడు రవీంద్ర. మరి ఫ్లాట్‌లో ఏం జరిగిందో తెలీదు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాదం తీవ్రంకావడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు రవీంద్ర.

లవర్‌ని చంపి ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు.. పోలీసులకు లొంగిపోయాడు

మౌనికను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వదిలించుకోవడానికి కిరాతక నిర్ణయం తీసుకున్నాడు. మౌనిక శరీర భాగాన్ని ముక్కలుగా నరికేశాడు. ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఫ్రిజ్‌లో ఉంచాడు. మృతదేహం తల భాగం కనిపించలేదు. ఘటన తర్వాత నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు రవీంద్ర. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఫ్రిజ్‌లో రెండు మూటల్లో వున్న శరీర భాగాలను గుర్తించారు. అయితే యువతి తలభాగం కనిపించలేదని తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో నిందితుడు చెబుతున్న వివరాలు మరొకలా ఉన్నాయి. తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ హింస తట్టుకోలేకే హత్య చేశానని తెలిపాడు.

ALSO READ: సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!

నిందితుడి మాటలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నేరం నుండి తప్పించుకోవడానికి నిందితుడు ఆ విధంగా చెప్పాడా? నిజంగా ఆర్థిక వివాదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పరిశీలన చేస్తున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగాలు నిందితుడి ఫ్లాట్‌కి వచ్చి ఆధారాలను సేకరించారు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు వెర్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×