E-Paper
Advertisement

వాషింగ్ మెషీన్‌లో బట్టలు రంగులు వదులుతున్నాయా? ఈ ఒక్క ట్రిక్ చేస్తే మిగతా బట్టలకు మరకలు అంటుకోవు

వాషింగ్ మెషీన్‌లో బట్టలు రంగులు వదులుతున్నాయా? ఈ ఒక్క ట్రిక్ చేస్తే మిగతా బట్టలకు మరకలు అంటుకోవు
Advertisement

చాలామంది రోజువారీ బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్‌ ఉపయోగిస్తుంటారు. ఇది సమయాన్ని ఆదా చేయడంతో పాటు శ్రమను కూడా తగ్గిస్తుంది. అయితే రంగు వదిలే ఒకే ఒక వస్త్రం కారణంగా అన్ని బట్టలపై మరకలు పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా కొనుగోలు చేసిన బట్టలు లేదా డార్క్ కలర్ దుస్తులు ఎక్కువగా రంగు వదిలే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

కొత్త బట్టలు రంగు వదులుతున్నాయో లేదో ముందుగానే పరీక్షించుకోవాలి

కొత్త బట్టలను ఇతర దుస్తులతో కలిపి వాషింగ్ మెషీన్‌లో వేయడానికి ముందు చిన్న పరీక్ష చేయడం మంచిది. ఇందుకోసం కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్‌ను బట్ట మూల భాగంలో రాసి, ఆ భాగాన్ని గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత నీళ్ల రంగును గమనించాలి. నీళ్ల రంగు మారితే ఆ వస్త్రం నుంచి కలర్ బయటకు వస్తోందని అర్థం. అలాంటి దుస్తులను విడిగా ఉతకడం వల్ల ఇతర బట్టలకు మరకలు పడకుండా కాపాడుకోవచ్చు.

ఉప్పు, పటికతో కలర్ బ్లీడింగ్ తగ్గించవచ్చు

Advertisement

బట్టల నుంచి రంగు బయటకు రావడం తగ్గించడానికి సంప్రదాయ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో 100 నుంచి 150 గ్రాముల ఉప్పు, కొద్దిగా పటిక పొడిని వేసి బాగా కలపాలి. తర్వాత రంగు వదిలే బట్టలను అందులో రెండు నుంచి రెండున్నర గంటల పాటు నానబెట్టాలి. ఈ ప్రక్రియలో ఎక్కువ భాగం వదులుగా ఉన్న రంగు ముందుగానే బయటకు వస్తుంది. అనంతరం బట్టలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో రంగు వదలడం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఫలితాలు బట్టల నాణ్యతపై ఆధారపడి ఉంటాయి.

వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు జాగ్రత్తలు అవసరం

బట్టలను వాష్ చేసిన తర్వాత కూడా డార్క్ కలర్, తెలుపు రంగు దుస్తులను విడివిడిగా ఉతకడం మంచిది. అలాగే ప్రతి వస్త్రంపై ఉన్న కేర్ లేబుల్ సూచనలను తప్పకుండా పాటించాలి. ఇలా చేయడం వల్ల ఖరీదైన దుస్తులు శాశ్వత మరకల నుంచి రక్షించబడతాయి.

Advertisement

Also Read: ఇంకా రూ.100, రూ.200 పెట్రోల్ పట్టిస్తున్నారా? పెట్రోల్ పంప్‌లలో ఇలా మోసాలు జరుగుతున్నాయి

బట్టలు మ‌ృదువుగా ఉండేందుకు మరో చిట్కా ఉపయోగపడుతుంది

ఉప్పు, పటికలో నానబెట్టిన తర్వాత కొన్ని బట్టలు గట్టిగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఒక బకెట్ నీటిలో కొద్దిగా తెల్ల వెనిగర్ కలిపి, బట్టలను ఐదు నిమిషాలు నానబెట్టి స్వల్పంగా కడగాలి. ఇలా చేయడం వల్ల బట్టలు మళ్లీ మెత్తగా మారడంతో పాటు మడతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

బట్టలను ఎక్కువ కాలం మన్నాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి

వాషింగ్ మెషీన్‌‌లో బట్టలు ఎక్కువగా నింపకుండా ఉపయోగించడం మంచిది. తెలుపు, డార్క్ కలర్, బ్రైట్ కలర్ దుస్తులను విడిగా ఉతకడం అలవాటు చేసుకోవాలి. కొత్త బట్టలను ముందుగా పరీక్షించడం ద్వారా రంగు మరకల సమస్యను నివారిస్తే, ఇష్టమైన దుస్తులను ఎక్కువ కాలం కొత్తవిగా ఉంటాయి.

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×