E-Paper
Advertisement

బిర్యానీలో ఈగ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోర్టు తీర్పు ఇదే!

బిర్యానీలో ఈగ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోర్టు తీర్పు ఇదే!
Advertisement

 Dead Fly in Biryani: వీకెండ్ వచ్చిందంటే చాలు.. వేడివేడి చికెన్ బిర్యానీతో లాగించేయాలని ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటారు. ముక్క నోట్లో పెట్టుకుంటే వచ్చే ఆ కిక్కే వేరు. కానీ, అదే బిర్యానీలో చనిపోయిన ఈగ కనిపిస్తే? ఊహించుకుంటేనే వాంతులు వచ్చినంత పనవుతుంది! సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఒక కస్టమర్‌కు. అయితే ఆ కస్టమర్ ఊరికే వదల్లేదు.. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి కోర్టు మెట్లు ఎక్కాడు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్.. సదరు హోటల్ యాజమాన్యానికి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ, చరిత్రలో నిలిచిపోయే తీర్పును వెలువరించింది. ఈ క్రేజీ ఇన్సిడెంట్ పుదుచ్చేరి (పాండిచ్చేరి) లో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..?

పుదుచ్చేరిలోని ఒక అత్యంత ప్రముఖ హోటల్ అయిన ‘బిర్యానీ అండ్ కో’ (Biryani & Co) కి ఒక కస్టమర్ వెళ్లాడు. ఎంతో ఇష్టంగా ఫుల్ ప్లేట్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కాసేపటికి టేబుల్ మీదికి ఘుమఘుమలాడే బిర్యానీ వచ్చింది. ఇంకేముంది.. ముక్క తిందామని స్పూన్ పెట్టాడో లేదో, అందులో ఒక చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. దాంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

Advertisement

వెంటనే ఆ హోటల్ సిబ్బందిని, మేనేజర్‌ను పిలిచి నిలదీశాడు. కనీసం సారీ చెప్పి, ప్లేట్ మారుస్తారని ఆశించిన ఆ కస్టమర్‌కు హోటల్ స్టాఫ్ నుంచి తీవ్ర నిరాశే ఎదురైంది. వారు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడమే కాకుండా, కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో అవమానానికి గురైన ఆ కస్టమర్.. ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. హోటల్ అపరిశుభ్రత, సేవలలో లోపాన్ని ఎండగడుతూ జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను (Consumer Forum) ఆశ్రయించాడు.

కోర్టులో హోటల్ యాజమాన్యానికి చుక్కలు

ఈ  కేసును స్వీకరించిన పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల ఫోరమ్ న్యాయమూర్తి దీనిపై లోతైన విచారణ జరిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇటువంటి నిర్లక్ష్యపు ధోరణిని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హోటల్ అందించిన సేవలలో  లోపం ఉందని, కస్టమర్ల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశారని నిర్ధారించింది. ఈ క్రమంలోనే హోటల్ యాజమాన్యానికి గట్టిగా తగిలేలా సంచలన తీర్పును ప్రకటించింది.

Advertisement

also read :పెద్ది టికెట్ రేట్లపై హైకోర్టు సీరియస్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కోర్టు!

బాధితుడికి జరిగిన మానసిక క్షోభకు, ఇబ్బందికి నష్టపరిహారంగా రూ.10,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీనితో పాటు సదరు కస్టమర్ న్యాయపోరాటం కోసం ఖర్చు చేసిన కోర్టు ఫీజుల నిమిత్తం మరో రూ.3,000… మొత్తంగా రూ.13,000 నగదును తక్షణమే చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని అల్టిమేటం జారీ చేసింది.

5 వారాల పాటు ‘ఫ్రీ బిర్యానీ’ శిక్ష

నగదు జరిమానా విధించడం వరకు ఓకే.. కానీ ఇక్కడే వినియోగదారుల ఫోరమ్ ఒక ఊహించని క్రేజీ ట్విస్ట్ ఇచ్చింది. కేవలం డబ్బులతో సరిపెట్టకుండా, సదరు హోటల్‌కు ఒక వినూత్నమైన శిక్షను ఖరారు చేసింది. బాధితుడికి రాబోయే 5 వారాల పాటు ప్రతి ఆదివారం (Sunday) రెండు ప్లేట్ల చొప్పున.. మొత్తంగా 10 ప్లేట్ల చికెన్ బిర్యానీని పూర్తిగా ఉచితంగా (Free Chicken Biryani) పార్సిల్ చేసి ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

బిర్యానీ తిందామనుకుంటే ఈగను చూపించి టార్చర్ పెట్టిన హోటల్‌ చేతే.. మళ్లీ ప్రతి వారం కస్టమర్‌కు ఉచితంగా అదే బిర్యానీ తినిపించేలా కోర్టు ఆర్డర్ వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వైరల్ అవుతున్న తీర్పు.. 

సాధారణంగా హోటల్స్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కస్టమర్లు గొడవపడి వదిలేస్తుంటారు. కానీ ఈ బాధితుడు మాత్రం వినియోగదారుల ఫోరమ్‌ ద్వారా న్యాయం ఎలా పొందాలో నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ తీర్పుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “శిక్ష అంటే ఇలా ఉండాలి.. బాధితుడికి పైసలు వచ్చాయి, దాంతో పాటు సండే స్పెషల్ బిర్యానీ పార్టీ కూడా సెట్ అయిపోయింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో “ఆ హోటల్‌లో ఈగ పడిన బిర్యానీ చూశాక.. మళ్లీ అదే హోటల్ బిర్యానీని ఆ కస్టమర్ మనస్ఫూర్తిగా తినగలడా?” అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా, కస్టమర్ల హెల్త్‌తో ఆడుకునే హోటల్స్‌కు ఈ జరిమానా, ఫ్రీ బిర్యానీ తీర్పు ఒక గట్టి హెచ్చరిక అని చెప్పక తప్పదు!

also read :బెడ్‌రూమ్‌లో శవమై కనిపించిన సూపర్ స్టార్.. అభిమానులను పెద్ద షాక్‌

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×