E-Paper
Advertisement

గ్రాండ్ మా మంచాన పడిందని వస్తే… ప్యారిస్ మోడల్ కు ప్యాంట్ తడిపించే కష్టం

గ్రాండ్ మా మంచాన పడిందని వస్తే… ప్యారిస్ మోడల్ కు ప్యాంట్ తడిపించే కష్టం
Advertisement

Psychological Horror Thriller అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మను చూసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మంచి చేయడం కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తర్వాత ప్రతి రాత్రి ఒక పీడకలలా అనిపిస్తే ఎలా ఉంటుంది? ఎదురుగా కనిపించే వ్యక్తి నిజంగా మనకు తెలిసిన వ్యక్తేనా అనే అనుమానం మొదలైతే? శరీరం, మనసు, ఆత్మ లాంటివి ప్రమాదంలో పడిపోయాయని అనిపిస్తే? అలాంటి భయం, మానసిక ఒత్తిడితో ప్రేక్షకులను కుదిపేసే స్పానిష్ హారర్ మూవీ ది గ్రాండ్ మదర్ (The Grandmother horror). 2021లో విడుదలైన ఈ మూవీకి పాకో ప్లాజా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంట్‌కి అందుబాటులో ఉంది.

ది గ్రాండ్ మదర్ కథేంటి?

కథలో సుసానా అనే యువతి పారిస్‌లో విజయవంతమైన మోడల్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్నప్పటి నుంచి తనను పెంచిన అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతుంది. దీంతో సుసానా వెంటనే స్పెయిన్‌కు తిరిగి రావాల్సి వస్తుంది. కొన్ని రోజులు మాత్రమే చూసుకుని తిరిగి పారిస్ వెళ్లిపోదామని భావించిన సుసానాకు అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.

Advertisement

మొదట్లో సాధారణంగా కనిపించే ఘటనలు క్రమంగా వింతగా మారడం మొదలవుతుంది. ఇంట్లో వినిపించే విచిత్రమైన శబ్దాలు, అర్థంకాని ప్రవర్తన, రాత్రి వేళల్లో కనిపించే భయంకర దృశ్యాలు సుసానాను మానసికంగా కుంగదీస్తాయి. ముఖ్యంగా మంచానికి పరిమితమైన అమ్మమ్మ చుట్టూ జరుగుతున్న కొన్ని ఘటనలు కథను మరింత భయానకంగా మారుస్తాయి. నిజానికి ఈ సినిమా సాధారణ దెయ్యాల కథలా ముందుకు సాగదు. వృద్ధాప్యం, ఒంటరితనం, శరీరం క్షీణించడం, మరణ భయం లాంటి అంశాలను హారర్‌తో కలిపి చూపిస్తుంది.

ట్విస్టుల మీద ట్విస్టులు:

సినిమా నెమ్మదిగా మొదలైనా, కథ ముందుకు సాగే కొద్దీ ఆడియెన్స్‌లో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. చివరి భాగంలో వచ్చే ట్విస్టులు చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా హాలీవుడ్ జంప్ స్కేర్స్ కంటే మానసిక భయాన్ని ఇష్టపడేవారికి ఈ చిత్రం మరింతగా నచ్చే అవకాశం ఉంది. హారర్ సినిమాల్లో కొత్త అనుభవం కోరుకునేవారికి, అసాధారణ కథలంటే ఇష్టమున్నవారికి ది గ్రాండ్ మదర్ ఒక మంచి ఎంపిక. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ ఇంటి వాతావరణం, ఆ అమ్మమ్మ పాత్ర, ఆ హారర్ సైలెన్స్‌ చాలా సేపు మనసును వెంటాడుతాయి.

Related News

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?

Big Stories

Advertisement
×