E-Paper
Advertisement

పెళ్లిళ్లు, పార్టీల్లో అందరి చూపు మీపైనే.. ఫంక్షన్స్‌లో మీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ఫ్యాషన్ టిప్స్

పెళ్లిళ్లు, పార్టీల్లో అందరి చూపు మీపైనే.. ఫంక్షన్స్‌లో మీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ఫ్యాషన్ టిప్స్
Advertisement

పెళ్లిళ్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం చాలామంది ఖరీదైన దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తేనే మంచి లుక్ వస్తుందని అనుకోవడం తప్పు. కొన్ని సింపుల్ స్టైలింగ్ టిప్స్ కూడా మీ రూపాన్ని పూర్తిగా మార్చగలవు. వీటిని పాటిస్తే తక్కువ ఖర్చుతోనే స్టైలిష్‌గా కనిపించవచ్చు.

ముందుగా సరైన కలర్స్ ఎంచుకోండి

ఒక వ్యక్తి అందంగా కనిపించాలంటే సరైన కలర్స్ ఎంపిక చేయడం చాలా ముఖ్యం. సరైన రంగులు మీ అందాన్ని మరింత పెంచుతాయి. పెళ్లిళ్లలో సంప్రదాయ రంగులు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పాస్టెల్ షేడ్స్ కూడా ట్రెండ్‌గా మారాయి. మింట్ గ్రీన్, లావెండర్, పౌడర్ బ్లూ వంటి రంగులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఒకే కలర్‌లో సంబంధించిన వివిధ షేడ్స్‌తో దుస్తులు ధరించడం కూడా మంచి ఎంపిక. దీనివల్ల మీ లుక్ మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. విభిన్న రంగుల కలయిక కూడా ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తుంది. ఉదాహరణకు సిల్క్ చీరకు బోల్డ్ కలర్ బ్లౌజ్ జత చేస్తే అందం రెట్టింపు అవుతుంది.

జ్యువెలరీ ఎంపిక చేయడం కీలకం

Advertisement

సరైన ఆభరణాలు మీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి. సాధారణ చీర లేదా కుర్తా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. భారీ ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు ధరించినప్పుడు తక్కువ ఆభరణాలు ఉపయోగించడం మంచిది. పెద్ద చెవిపోగులు లేదా చంద్రకారంలో ఉంటు కమ్మలు ధరించడం ద్వారా క్లాసీ లుక్ పొందవచ్చు. సింపుల్ దుస్తులు ధరించినప్పుడు హెవీ నెక్లెస్ లేదా కుందన్ సెట్ ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.

పాత దుస్తులకు కొత్త లుక్ ఇవ్వండి

ప్రతి వేడుకకు కొత్త దుస్తులు కొనాల్సిన అవసరం లేదు. పాత దుస్తులను కొత్తగా స్టైల్ చేయవచ్చు. పాత పట్టు చీరకు మోడ్రన్ క్రాప్ టాప్ బ్లౌజ్ జత చేస్తే ట్రెండీ లుక్ వస్తుంది. లెహంగా స్కర్ట్‌కు స్టైలిష్ కేప్ లేదా ష్రగ్ జోడించడం ద్వారా ఇండో వెస్ట్రన్ లుక్ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా కావడంతో పాటు ప్రత్యేకమైన స్టైల్ మీ సొంతమవుతుంది.

సౌకర్యవంతమైన ఫుట్‌వేర్‌ను ఎంచుకోండి

Advertisement

చాలామంది దుస్తులపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ ఫుట్‌వేర్ కూడా మొత్తం లుక్‌పై ప్రభావం చూపుతుంది. చీరలు, లెహంగాలతో ఎథ్నిక్ హీల్స్ లేదా మోజరీలు బాగా సరిపోతాయి. స్టైల్‌తో పాటు సౌకర్యం కూడా చాలా ముఖ్యం. సౌకర్యవంతమైన చెప్పులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పెళ్లిళ్లలో ఎక్కువసేపు నడవడం, డ్యాన్స్ చేయడం సులభమవుతుంది.

Also Read: ఇంకా రూ.100, రూ.200 పెట్రోల్ పట్టిస్తున్నారా? పెట్రోల్ పంప్‌లలో ఇలా మోసాలు జరుగుతున్నాయి

మేకప్, హెయిర్ స్టైల్‌ను సింపుల్‌గా ఉంచండి

మేకప్, హెయిర్ స్టైల్ మీ లుక్‌ను పూర్తి చేస్తాయి. ప్రస్తుతం నేచురల్ లుక్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. లైట్ మేకప్, న్యూడ్ లిప్‌స్టిక్ చాలా అందంగా కనిపిస్తాయి.
సాఫ్ట్ స్మోకీ ఐస్ ముఖానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. సాఫ్ట్ కర్ల్స్, మెస్సీ బన్ లేదా స్లీక్ పోనీటైల్ వంటి హెయిర్ స్టైల్స్ ట్రెండీగా ఉంటాయి. మీ ముఖాకృతికి సరిపోయే హెయిర్ స్టైల్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

స్టైలిష్‌గా కనిపించడానికి ఖరీదైన దుస్తులు అవసరం లేదు. సరైన స్టైలింగ్ చిట్కాలు పాటిస్తే చాలు. సరైన కలర్స్, జువెలరీ, సౌకర్యవంతమైన ఫుట్‌వేర్, సింపుల్ మేకప్ మీ అందాన్ని మరింత పెంచుతాయి.

Related News

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×