E-Paper
Advertisement

Eggs Eating: రెండు వారాల పాటూ ప్రతిరోజూ గుడ్డు తిని చూడండి, మీలో జరిగే మార్పులు ఇవే

Eggs Eating: రెండు వారాల పాటూ ప్రతిరోజూ గుడ్డు తిని చూడండి, మీలో జరిగే మార్పులు ఇవే
Advertisement

ప్రతిరోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని వినే ఉంటారు. తాజా అధ్యయనాల ప్రకారం 14 రోజుల పాటు ప్రతిరోజూ ఉడకబెట్టి గుడ్లు తింటే శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. గుడ్లు చిన్నవైనా, వాటిలో ఉన్న పోషకాలు మాత్రం ఎంతో గొప్పవి. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు కలిగిఉన్న కంప్లీట్ ఫుడ్‌గా గుడ్లను భావిస్తారు. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే రోజు మొత్తం శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ః

గుడ్డు ఎందుకు తినాలి?
గుడ్లలో ఉండే చోలిన్ అనే పోషక పదార్థం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది. అలాగే గుడ్లలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ (HDL) గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. చాలా మంది గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్నదేమిటంటే, సరైన పరిమితిలో గుడ్లు తింటే హానికరం కాదు. అదేవిధంగా గుడ్లలో ఉండే ల్యూటిన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisement

Also read: Cashew: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు

ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల పెరుగుదలకు, శక్తి పెరగడానికి సహాయపడుతుంది. ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల వ్యాయామం చేసే వారు, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు గుడ్లు తప్పకుండా తీసుకుంటే మంచిది. గుడ్లు తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో ఎక్కువగా తినడం తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుడ్లలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు చర్మం మెరుపును పెంచి, జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

Advertisement

Also read: అద్భుతం.. విమానం నుంచి చూస్తే తిరుమల ఎంత అద్భుతంగా ఉందో చూడండి!

ఎన్ని గుడ్లు తినాలి?
గుడ్లు ఎంత మంచివైనా మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినడం చాలా మంది మంచిది భావిస్తారు. కానీ గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని గుడ్లు తినాలి. ఎక్కువగా గుడ్లు తింటే కొంతమందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్కరి శరీరం వేర్వేరుగా స్పందిస్తుంది. అందువల్ల మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి గుడ్లను డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

Related News

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Big Stories

Advertisement
×