E-Paper
Advertisement

Cashew: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు

Cashew: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు
Advertisement

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న చాలా మంది తమ డైట్‌లో ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. జీడిపప్పు తింటే బరువు పెరుగుపోతామనే సందేహం చాలా మందిలో ఉంది. కానీ ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు. బరువు పెరుగుతామన్న భయంతో జీడిపప్పు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన మోతాదులో తింటే ఇది బరువు తగ్గడంలో ఇదెంతో సహాయపడుతుంది.

జీడిపప్పులో ఉండే పోషకాలు
జీడిపప్పులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో మధ్యలో తినే అలవాటు తగ్గి, మొత్తం క్యాలరీలు తగ్గుతాయి. జీడిపప్పులో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో ఇవి ఆకలి నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో అనవసరంగా జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గుతుంది. ఈ విధంగా జీడిపప్పు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

Also read: Milk and Makhana: పాలల్లో మఖానా వేసి ప్రతిరోజూ తింటే శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో తెలుసా?

బరువు తగ్గుతారు
జీడిపప్పులో మెగ్నీషియం శరీరంలోని మెటాబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే మనం తినే ఆహారం శక్తిగా మారే ప్రక్రియ సరిగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీడిపప్పులు తింటే ఆకలి తగ్గించే హార్మోన్లు యాక్టివ్ అవుతాయి. ముఖ్యంగా ఉదయం కొద్దిగా కాజూ తింటే 4–5 గంటల వరకు ఆకలి తగ్గుతుంది. దీంతో తరచూ తినే అలవాటు తగ్గుతుంది. ఇది కూడా బరువు తగ్గడంలో ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.

Advertisement

Also read: Air Fryer and Microwave: ఎయిర్ ఫ్రయర్, మైక్రోవేవ్ వాడితే క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఏమిటి?

జీడిపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి అధికంగా తింటే ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. అందుకే రోజుకు 4 నుంచి 6 కాజూలు మాత్రమే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా తింటే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు లేదా నూనెలో వేయించిన జీడిపప్పులు తినకూడదు. వీటిలో అదనపు సోడియం, కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి పచ్చివి మాత్రమే తీసుకోవడం మంచిది.

జీడిపప్పులు బరువు తగ్గడంలో సహాయపడతాయి కానీ అడ్డుకోవు. సరైన మోతాదులో తీసుకుంటే ఇది మీ డైట్‌కు మంచి సపోర్ట్‌గా పనిచేస్తుంది. ఆకలి నియంత్రణ, మెటాబాలిజం మెరుగుదల, శరీరానికి అవసరమైన పోషకాలు అందించడం వంటి ప్రయోజనాలు ఇస్తుంది. అయితే మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలని అనుకునే వారు జీడిపప్పును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×