E-Paper
Advertisement

Curd with Sugar: ఈ కాంబినేషన్ మీకూ ఇష్టమా?.. ఆ సమయాల్లో తింటే అద్బుత‌మైన లాభాలు పొందొచ్చు!

Curd with Sugar: ఈ కాంబినేషన్ మీకూ ఇష్టమా?.. ఆ సమయాల్లో తింటే అద్బుత‌మైన లాభాలు పొందొచ్చు!
Advertisement

Curd with Sugar: పెరుగు.. ఓ అద్భుతమైన ఆహారం.ఇది శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోబయోటిక్ ఆహార పదార్థం. అలాగే చాలామందికి భోజనంలో పెరుగు తినే అలవాటు ఉంటుంది. ఎంతలా అంటే.. పెరుగు లేనిదే వారి భోజనం పూర్తవ్వనంతగా. అయితే, మన శరీరం అధిక వేడికి గురైనప్పుడు కొంతమంది పెరుగులో చక్కెర వేసుకుని తింటుంటారు. ఇలా పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. దీనిలో ఉండే లాక్టోబాసిల్లస్, బైఫైడోబాక్టీరియం అనే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు పెరుగును తరచూ తీసుకోవడం మంచిది.

తక్షణ శక్తి పొందవచ్చు:

శరీరం ఒత్తిడికి గురైనప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు పెరుగులో కాస్త చక్కెర కలుపుకుని తినవచ్చు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఉదయం అల్పాహారం తర్వాత లేదా వ్యాయామం చేసిన వెంటనే పెరుగు-చక్కెర కలిపి తింటే.. శరీరానికి అవసరమైన కేలరీలు అందుతాయి. ఈ కాంబినేషన్ అలసటను తగ్గించి శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.

బోలెడు ప్రయోజనాలు:

Advertisement

పెరుగులో ఉన్న కాల్షియం, ప్రోటీన్‌లు ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. రోజూ తిపడం వలన ఎముకలు దృఢంగా మారి, శరీరానికి బలాన్ని అందిస్తుంది. చక్కెరతో కలిపి తినడం వల్ల విటమిన్ బి12, ప్రొటీన్‌లు పుష్కలంగా అందుతాయి. పెరుగు-చక్కెర కాంబినేషన్ మెదడు పనితీరును మెరుగుపరచి, మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. అలాగే చక్కెర కలిపిన పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. దీనిలోని విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని రోగాల నుండి కాపాడతాయి. వేసవిలో అధికంగా తీసుకోవడం వల్ల.. మన శరీరానికి పెరుగు చల్లదనాన్ని ఇచ్చి, ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. డీహైడ్రేషన్‌ను నివారించడంలో పెరుగు-చక్కెర కాంబినేషన్ ఉపయోగకరంగా ఉంటుంది.

కండీషన్స్ అప్లై:

పెరుగులో చక్కెర కలిపిన మిశ్రమాన్ని మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే.. ఇందులోని అధిక తియ్యదనం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర లేకుండా పెరుగును మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అలాగే, లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ ఉన్నవారు లేదా ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారు దీనిని పూర్తిగా తినకపోవడమే మంచిది.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×