ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి రావొచ్చు.
సీఎం చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై భల్లా.. ముఖ్యమంత్రికి వివరించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ స్లాబ్‌కు డ్రిల్ చేస్తుండగా.. పాత భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో స్లాబ్ కింద ఉన్న ఇద్దరు కూలీలపై పడటంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు.. సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను మోసం చేశారు. రైడ్ చేయకుండా ఉండటానికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. భయపడి ఆయన పలు ఖాతాలలో 2 లక్షల రూపాయలు వేశారు. మరో లక్ష రూపాయలు అడగడంతో.. అనుమానం వచ్చి శ్రీనివాస్ ఏసీబీకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు జరిగిన ప్రమాదంలో 90 మంది ప్రయాణికులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రన్నింగ్ బస్సులో అకస్మాత్తుగా పొగ రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను దించేశాడు. దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
విజయవాడ జిల్లాలో సూర్యారావు పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా భర్త పొడిచి హత్య చేశాడు. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతికి.. ఆమె భర్తకు కొన్ని నెలలుగా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న భర్త.. ఆమెను పొడిచి చంపాడు.
కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18నెలలు అయిన.. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. కూటమి సర్కార్ క్రెడిట్ చోరీ చేస్తుందని.. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తుందని ఆరోపించారు శ్రీకాంత్ రెడ్డి.
యాదాద్రి భువనగిరి ఎస్సీ గురుకులంలో 11.37లక్షల పీఎంశ్రీ నిధుల్లో గోల్‌మాల్ జరిగింది. చేయని పనులకు.. తీసుకురాని వస్తువులకు కూడా నకిలీ బిల్లులు పెట్టి జేబులు నింపుకున్నారని ఆరోపణలు వెల్లువైతున్నాయి. ఈ విషయంపై బిగ్ టీవీ స్వేచ్ఛలో ప్రచురించిన కథనానికి స్పందించారు జిల్లా విద్యాశాఖ అధికారులు. వెంటనే పాఠశాలలో ఎంక్వయిరీకి ఆదేశించారు.
కడప జిల్లాలో వైసీసీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ బాలకృష్ణ యాదవ్. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆందోళనలో వాస్తవం లేదన్నారు. అధికారంలో ఉండగా 17 కాలేజీల విషయంలో వైసీపీ ఏమేరకు పనులు చేసిందో.. తమ దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువవుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఛాంబర్‌లో రికార్డులను విజిలెన్స్ డీఎస్పీ నారాయణ రెడ్డి పరిశీలించారు.
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీని అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. కుప్పంలో జరిగిన డెలిగేషన్ మీటింగ్‌లో ఇండో-తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అలీజియన్స్ గ్రూప్, ఫుట్‌వేర్ యూనిట్‌కు పౌచెన్ గ్రూప్ ఆసక్తి చూపాయి. ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్ల ఉత్పత్తికి క్రియేటివ్ సెన్సార్ ఇంక్, అడ్వాన్స్‌డ్ బ్యాటరీ యూనిట్‌కు ఇ-జౌల్ ఇండియా ముందుకు వచ్చాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీల ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు దక్కాల్సిన వాటా కోసం గవర్నర్ ద్వారా కేంద్రానికి లేఖ పంపిన గాని.. కేంద్ర ప్రభుత్వం బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటుందని మండిపడ్డారు బీర్ల ఐలయ్య.
విశాఖ CII సదస్సుకు 3,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పూర్తి అప్రమత్తత ప్రకటించారు. జగన్ బ్యాచ్ చేస్తున్న విష ప్రచారాన్ని రాజకీయ ఉగ్రవాదంగా పేర్కొంటూ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో టీడీపీ బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వైసీపీ నిరసనను ఖండించారు. అవగాహన లేని మాటలతో వైసీపీ తప్పుదారి పట్టిస్తోందని, PPP ద్వారా కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక, వాటిని ప్రభుత్వమే ఆధీనంలోకి తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో విషాదం జరిగింది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కూతుర్ని కలవడానికి వచ్చి లిఫ్ట్‌లో పడి తండ్రి మరణించినట్లు తెలుస్తోంది. లిఫ్ట్ దగ్గరకు వచ్చిన వృద్ధుడు.. బటన్ నొక్కడంతో డోర్ ఓపెన్ అయింది. అయితే లిఫ్ట్ వచ్చిందనుకోని లోపలికి అడుగుపెట్టగానే.. ఐదో అంతస్తు నుంచి.. గ్రౌండ్ ఫ్లోర్‌లో పడ్డాడు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 14న మొదలవనుంది. నితీశ్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రి అవుతారని NDA ధీమా వ్యక్తం చేస్తుండగా, మహాఘట బంధన్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గట్టి నమ్మకంతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం NDAకు స్పష్టమైన మెజారిటీని అంచనా వేశాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసులో భాగంగా, పోలీసులు కర్ణాటకలోని తుమకూరులో మాజీ ఉగ్రవాది ముజాహిద్‌ను రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ ఘటనతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తేలడంతో విడుదల చేశారు. పేలుడుకు బెంగళూరు నెట్‌వర్క్‌తో ఏమైనా లింకులు ఉన్నాయా అని NIA దర్యాప్తు చేస్తోంది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తమ దేశం తూర్పు సరిహద్దులోని భారత్, పశ్చిమ సరిహద్దులోని తాలిబన్లతో ఏకకాలంలో యుద్ధానికి సిద్ధంగా ఉందని బహిరంగంగా ప్రకటించారు. పాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని భారత్‌కు ఆపాదించే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఐపీఎల్ 2026 కోసం పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేస్తోంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ వంటి ముఖ్య ఆటగాళ్లను కొనసాగించనుంది. అయితే, ఆశించిన ప్రదర్శన చేయని కారణంగా విదేశీ ఆటగాళ్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్‌లను విడుదల చేయాలని పంజాబ్ యోచిస్తోంది.
ఈ నెల 15న జరగబోయే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు సంబంధించిన దర్శకుడు రాజమౌళి ..అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈవెంట్‌కు పాసులు ఉన్న వారే రావాలని సూచించారు. ఫిజికల్ పాసెస్ ఉంటే తప్ప వేడుకకు రావద్దంటూ స్ట్రిక్ట్‌గా చెప్పారు. అంతేకాదు పాసుల మీద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తూ..ఎలా రావాలనేది తెలుస్తుందన్నారు.