E-Paper
Advertisement

Flax Seeds: అవిసె గింజల పొడిని ఇలా తిన్నారంటే బరువు తగ్గిపోవడం ఖాయం

Flax Seeds: అవిసె గింజల పొడిని ఇలా తిన్నారంటే బరువు తగ్గిపోవడం ఖాయం
Advertisement

సూపర్ ఫుడ్స్ లో అవిసె గింజలు భాగమైపోయాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల అనారోగ్యాలు రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంటుంది. ముఖ్యంగా వీటిని పొడి చేసుకొని తింటే శరీరానికి మరింత బలం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రోజూ కొద్ది కొద్దిగా అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. పూర్వకాలంలో కూడా అవిసె గింజలను వాడేవారని చెబుతారు. గంజి, పెరుగు, చట్నీలో ఈ అవిసె గింజలను వేసి నానబెట్టి తినేవారు.

అవిసె గింజల పొడితో లాభాలు
అవిసె గింజల పొడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గించడంలో ఇవి ముందుంటాయి. అలాగే రక్తనాళాల్లో వాపును తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి అవిసె గింజల పొడి వరమనే చెప్పాలి. ఇందులో ఉండే ఫైబర్ ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కర స్థాయిలు ఒకేసారి విడుదల కాకుండా నెమ్మదిగా విడుదలవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజు పరిమితంగా తీసుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Also read: Flax seeds: అవిసె గింజల నూనెతో ఇలా కూడా చేస్తారా! ఉపయోగం ఏమిటి?

జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అవిసె గింజల పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్, మలబద్ధకం సమస్య రాకుండా అడ్డుకుంటుంది. పేగులు కదలికలను కూడా పెంచి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి అవిసెగింజల పొడి ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలిగా ఉండదు. అవసరంలేని జంక్ ఫుడ్ వంటివి తినాలన్న ఆసక్తి కూడా పుట్టదు. అలాగే చర్మం, జుట్టు మరిచిపోవడానికి ఇది కారణమవుతుంది. మొటిమలు తగ్గించడం, జుట్టు రాలడాన్ని ఆపడం వంటివన్నీ అవిసె గింజల పొడి అద్భుతంగా చేస్తుంది.

Advertisement

ఇలా తింటే మంచిది
అవిస గింజల్లో ఉండే లిగ్నన్స్ అనే సమ్మేళనాలు.. హార్మోన్ల సమతుల్యతను కూడా కాపాడతాయి. ముఖ్యంగా మహిళలు అవిసె గింజలు తీసుకోవడం చాలా అవసరం. వీరిలో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి అవిసె గింజల పొడికి ఉంటుంది. ఎముకలను బలంగా మార్చేందుకు ఇది సహాయపడుతుంది. ఖనిజాలు, ఫైటో ఈస్ట్రోజన్లు, ఎముకల సాంద్రతను కాపాడేందుకు సహాయపడతాయి. అవిసె గింజలను పూర్తిగా పొడి రూపంలోనే తీసుకోవాలని లేదు. అవిసె గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగినా చాలు.. అలాగే గంజి, పెరుగు, ఓట్స్ స్మూతీలు, మజ్జిగలో వేసి అవిసె గింజలను కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×