Flax seeds: మన ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన అనేక రహస్యాల్లో ఒకటి అవిసె గింజలు. ఈ చిన్న గింజల్లో అనేక పోషకాల నిండుగా ఉన్నాయి. వీటి గింజలు మాత్రమే కాదు, వాటి నుంచి తయారుచేసే నూనె కూడా మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని ‘లిన్‌సీడ్ ఆయిల్’ అని కూడా పిలుస్తారు. గుండె, మెదడు, చర్మం వంటి ముఖ్యమైన అవయవాలను ఆరోగ్యంగా ఉంచటంలో ఈ నూనె ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఈ నూనె వల్ల లభించే ప్రధాన ప్రయోజనాలను, దాని వాడక విధానాలను సమగ్రంగా తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి ఉపయోగ పడుతుంది
అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. అవిసె గింజల నూనెలో ఉన్న ALA శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తూ, బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాక, ఈ నూనె వలన శరీరంలో ఉండే లోపల, బయట వాపులు తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా రక్షణ కలుగుతుంది.
మలబద్ధకం సమస్యకు అవిసె నూనె
మెదడుకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నూనెలోని ALA, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఈపీఏ, డీహెచ్ఏ వంటి పోషకాలు మెదడును చురుగ్గా, జ్ఞాపకశక్తిని పెంచే విధంగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూ, ఏకాగ్రత పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. అవిసె గింజల నూనె సహజ లాక్సేటివ్‌గా పని చేస్తుంది, అందువల్ల మలబద్ధకం సమస్యలు తక్కువగా ఉంటాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.
Also Read: Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటున్నారా..? వచ్చే మార్పులు ఇవే!
చర్మ ఆరోగ్యానికి మంచి టానిక్
చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. నూనెలో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వలన చర్మంలోని వాపులు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలలో ఉపశమనం లభిస్తుంది. చర్మం యవ్వనంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
ఈ నూనెను ఎలా వాడాలి?
ఈ నూనెను నేరుగా వంటలో వేసి వేడి చేయడం మంచిది కాదు. దాని వల్ల అనారోగ్య కారణాలకు దారితీస్తుంది. మనం వండే కూర పూర్తయిన తర్వాత ఈ నూనెను సరైన మోతాదులో చేర్చుకోవాలి. లేదంటే ఈ నూనెను నేరుగా తిన్నా మంచిదే. వృద్ధులు రోజుకు ఒక టేబుల్ స్పూన్ వరకు దీనిని నేరుగా తాగినా సరిపోతుంది. పానీయాలు లేదా సలాడ్స్‌లో కలుపుకొని తీసుకోవడం ద్వారా దీని లాభాలను పొందవచ్చు. ఇలా చేయడం వలన గుండె, మెదడు, చర్మం అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజూ చిన్న మొత్తంలో వాడటం ద్వారా మనం పెద్ద ఆరోగ్య లాభాలను పొందవచ్చు.