E-Paper
Advertisement

Trending Bikes January 2026: BMW To KTM.. జనవరి 2026లో ట్రెండింగ్ బైక్స్ ఇవే!

Trending Bikes January 2026: BMW To KTM.. జనవరి 2026లో ట్రెండింగ్ బైక్స్ ఇవే!
Advertisement

దేశీ మార్కెట్లోకి 2026లో క్రేజీ బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జనవరిలో అడ్వెంచర్, స్పోర్టీ సెగ్మెంట్‌ బైక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. కొత్తగా పలు బైక్స్ లాంచ్ కాబోతున్నాయి. టాప్ ట్రెండింగ్ మోడల్స్‌ లో BMW F 450 GS, KTM 390 Adventure R ఉన్నాయి, Royal Enfield Bullet 650, Brixton Crossfire 500 Storr లాంటి బైక్స్ ఉన్నాయి. ఈ బైక్‌లు మోటార్ సైకిల్ మార్కెట్‌ లో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి.  ముఖ్యంగా యంగ్ రైడర్లు, అడ్వెంచర్ ఎంతూసియాస్ట్‌ లను ఆకట్టుకుంటున్నాయి.  ఈ నెలలో టాప్ ట్రెండింగ్ బైక్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం..

⦿ BMW F 450 GS

ఈ బైక్ ధర రూ. 4.50 లక్షల నుంచి రూ. 5.50 లక్షలు ఉంటుంది. 420 సీసీ ఇంజిన్ ఉంటుంది. 48 hp పవర్ 43 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 180 mm సస్పెన్షన్ ట్రావెల్, డ్యూయల్ పర్పస్ టైర్లు, స్లిప్పర్ క్లచ్, క్విక్‌ షిఫ్టర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ నెలలో ఈ బైక్ లాంచ్ కానుంది.

⦿ KTM 390 Adventure R

Advertisement

ఈ బైక్ ధర రూ. 3.80 లక్షల నుంచి రూ. 4.15 లక్షల వరకు ఉంటుంది. 399 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 45 PS పవర్, 39 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 230 mm సస్పెన్షన్ ట్రావెల్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఆఫ్ రోడ్ మోడ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ Royal Enfield Bullet 650

ఈ బైక్ ధర రూ. 3.50 లక్షల నుంచి రూ. 4.00 లక్షలు ఉంటుంది. 648 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 47 hp పవర్, 52 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెట్రో స్టైల్, డ్యూయల్ ఎగ్జాస్ట్, LED లైటింగ్, ABS లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ Brixton Crossfire 500 Storr

Advertisement

ఈ బైక్ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 4.50 లక్షలు ఉంటుంది. 500 సీసీ ఇంజిన్, 47 hp పవర్, 43 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్క్రాంబ్లర్ డిజైన్, డ్యూయల్ స్పోర్ట్ టైర్లు, డిజిటల్ క్లస్టర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read Also: హోండా TO రాయల్ ఎన్ఫీల్డ్.. రూ. 1.5 లక్షల లోపు బెస్ట్ బైక్‌లు ఇవే!

⦿ KTM RC 160

ఈ బైక్ ధర రూ. 1.80 లక్షల నుంచి రూ. 2.00 లక్షలు ఉంటుంది. 160 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 16 hp పవర్, 14 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్టీ ఫుల్ ఫెయిరింగ్, డ్యూయల్ చానల్ ABS, LED హెడ్‌లైట్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.  ఈ బైక్ కూడా ఈ నెలలో లాంచ్ అవుతుందని అంచనా.

Royal Enfield Hunter 350, Classic 350, Hero Xtreme 125R, TVS Raider, Bajaj Pulsar NS160 లాంటి బైక్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కమ్యూటర్,  స్పోర్టీ సెగ్మెంట్‌లో టాప్‌లో ఉన్నాయి.

Read Also: ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర జస్ట్ రూ. 61 వేలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×