E-Paper
Advertisement

భర్తను వదిలి ప్రియుడితో ప్రేమాయణం… కళ్ళు తెరిపించే క్లైమాక్స్

భర్తను వదిలి ప్రియుడితో ప్రేమాయణం… కళ్ళు తెరిపించే క్లైమాక్స్
Advertisement

Romantic Drama OTT :  ప్రేమ కథలు ఓటీటీలో బోలెడు ఉన్నాయి. అయితే కొన్ని కథలు మాత్రం జీవితాన్ని కళ్ళముందు ఉంచుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది పాత కాలపు రష్యా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ లవ్ డ్రామా. పెళ్లయ్యి ఒక బాబు ఉన్న ఒక ఇల్లాలు, వేరే వ్యక్తితో ప్రేమలో పడితే.. ఆ తర్వాత ఆవిడ జీవితం ఎంత గందరగోళంగా మారింది, సమాజం ఆమెను ఎలా చూసింది అనేదే ఈ సినిమా. ఇది మామూలు సినిమాలా కాకుండా, ఒక స్టేజ్ నాటకం చూస్తున్నట్లు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక చిన్న తప్పు జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో ఈ సినిమాని చూసి తెలుసుకోవచ్చు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

జో రైట్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా పేరు ‘అన్నా కరెనీనా’ (Anna Karenina). ఈ చిత్రం లియో టాల్‌స్టాయ్ రాసిన రష్యన్ నవల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో కీరా నైట్లీ (అన్నా కరెనీనాగా), జూడ్ లా (అలెక్సీ కరెనిన్), ఆరోన్ టేలర్-జాన్సన్ (కౌంట్ వ్రాన్స్కీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని కీరా నైట్లీ కట్టుకున్న బట్టలు, ధరించిన నగలు అప్పట్లో పెద్ద సంచలనం. ఇందుకోసం దాదాపు $2 మిలియన్ల విలువైన వజ్రాల నగలను వాడారు. ఈ చిత్రం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. సినిమాలోని దుస్తులు, సెట్టింగులు అప్పటి రష్యన్ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ప్రస్తుతం పాపులర్ అయిన నటి అలిసియా వికందర్ కి ఇది మొదటి పెద్ద హాలీవుడ్ మూవీ. ఇందులో ఆమె ‘కిట్టి’ అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అన్నా కరెనీనా రష్యాలోని ఒక ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె భర్త ప్రభుత్వంలో పెద్ద అధికారి, సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అయితే వాళ్ళ మధ్య ప్రేమ కంటే బాధ్యతే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తన అన్నయ్య కుటుంబ గొడవలు సర్దడానికి వెళ్ళిన అన్నాకు, అక్కడ వ్రాన్స్కీ అనే ఒక యంగ్ సైనిక అధికారి పరిచయమవుతాడు. మొదటి చూపులోనే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. తనకు పెళ్లయి, ఒక బాబు ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయి అన్నా వ్రాన్స్కీతో ప్రేమలో మునిగిపోతుంది. వీరిద్దరి వ్యవహారం బయటపడటంతో సమాజం అన్నాను హీనంగా చూడటం మొదలుపెడుతుంది.

భర్త ఆమెను హెచ్చరించినా వినకుండా, కొడుకుని వదిలేసి వ్రాన్స్కీతో కలిసి వెళ్ళిపోతుంది. కానీ ఆ తరువాత అవమానాలు, భర్త కొడుకుని చూడనివ్వకపోవడం ఆమెను మానసిక వేదనకు గురిచేస్తాయి. రాను రాను వ్రాన్స్కీకి తనపై ప్రేమ తగ్గిపోయిందని అన్నా అనుమానపడటం మొదలు పెడుతుంది. ఆ ఒంటరితనం తట్టుకోలేక ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. చివరికి తను ప్రేమించిన వాడు, వదులుకున్న కుటుంబం రెండూ దక్కలేదనే బాధతో, రైలు కింద పడి ప్రాణాలు వదిలేస్తుంది అన్నా. ఒక చిన్న పొరపాటు ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ కథ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

Advertisement

Read Also : 40 ఏళ్ల అత్త 15 ఏళ్ల మేనల్లుడితో… ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×