E-Paper
Advertisement

ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం కరెక్టేనా? మీ శరీరంపై పడే ప్రభావం ఇదే

ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం కరెక్టేనా? మీ శరీరంపై పడే ప్రభావం ఇదే
Advertisement

ఉదయం వేళ ఏమీ తినకుండా ఖాళీ కడుపున వ్యాయామం చేస్తే ఉపవాస స్థితిలో వ్యాయామం చేసినట్లే. అంటే చాలా గంటలు ఏమీ తినకుండా వ్యాయామం చేయడం. చాలా మంది ఉదయం లేచిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే వ్యాయామం చేస్తారు. కొందరు ఇలా చేయడం వల్ల ఎక్కువ కొవ్వు కరుగుతుందని నమ్ముతారు. మరికొందరు ఇలా చేస్తే సరిగా వ్యాయామం చేయలేమని వాదిస్తారు. మరి ఈ రెండింటిలో ఏది సరైనది.

ఖాళీ కడుపుతో వ్యాయామం కొవ్వు తగ్గడానికి సహాయపడుతుందా?

పడ కడుపున అంటే ఉదయం నిద్ర లేచిన తరువాత ఏమీ తినకుండా వ్యాయామం చేస్తే మీ శరీరం.. నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే శరీరంలో గ్లైకోజెన్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరం కొవ్వును ఇంధనంగా మార్చుకుంటుంది. అయితే ఇలా చేయడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతామని గ్యారెంటీ లేదు. అధ్యయనాలు చెబుతున్నట్లు ఏమీ తినకుంగా లేదా తిన్నాక వ్యాయామం చేసినా కొవ్వు తగ్గడం సమానంగానే ఉంటుంది. బరువు తగ్గడం మొత్తం క్యాలరీల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.

ఖాళీ కడుపున వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Advertisement

కొందరు వ్యక్తులు.. ఉదయం ఏ ఆహారం తినకుండానే వ్యాయామం చేయడం సౌకర్యంగా ఉంటుందని చెబుతారు. ఇలా చేస్తే.. వ్యాయామ సమయంలో కడుపు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. తాత్కాలికంగా కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు ఖాళీ కడుపున చేయడం చాలా మంచిది. కొందరు ఇలా చేస్తే శరీరం తేలికగా, చురుకుగా ఉంటుందని అంటారు.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల నష్టాలు

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే శక్తి స్థాయి తగ్గి అలసట, బలహీనత వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల తలతిరగడం లేదా వాంతులు రావొచ్చు. వ్యాయామం సరగా చేయలేకపోతారు. ఎక్కువ బల ప్రయోగం, స్టామినాతో చేయాల్సిన వ్యాయామాలు చేయడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ బలం ప్రయోగిస్తే శరీరం కండరాల ప్రోటీన్‌ను కూడా కరిగించేస్తుంది. దీని వల్ల కండరాలు కూడా బలహీనమవుతాయి. ఆ తరువాత కండరాల వృద్ధి, రికవరీ నెమ్మదిస్తుంది.

Advertisement

Also Read: సిగరెట్, గాంజా తాగేవారి మెదడులో తీవ్ర మార్పులు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

ఎవరు ఖాళీ కడుపున వ్యాయామం చేయకూడదు?

డయాబెటిస్ ఉన్నవారు ఖాళీ కడుపున వ్యాయామం చేయకూడదు. రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా తగ్గే అవకాశం ఉంటుంది. తక్కువ రక్తపోటు (లో బిపి) ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాయామం చేసే వారు కూడా తగిన శక్తి లేకుండా వ్యాయామం చేయకూడదు.

ఎప్పుడు ఖాళీ కడుపున వ్యాయామం చేయవచ్చు?
తేలికపాటి వ్యాయామాలు.. నడక, స్ట్రెచింగ్, యోగా వంటివి ఖాళీ కడుపున చేయడం సురక్షితం. చిన్న వ్యాయామాలు అయితే ఎలాంటి అసౌకర్యం ఉండదు. మీ శరీరం ఎలా ఫీల్ అవుతోందో జాగ్రత్తగా గమనించండి.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×