E-Paper
Advertisement

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 8 మంది మృతి, మరో 12 మందికి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 8 మంది మృతి, మరో 12 మందికి
Advertisement

Road Accident: అతివేగం ప్రమాదకరం.. రోడ్డు పక్కన పదే పదే బోర్డులు దర్శినమిస్తాయి. అయినా వాహనాదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. వేగంగా డెస్టినేషన్‌కు చేరుకోవాలనే ఆలోచనలో ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. బొలెరో వాహనం -లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలడోన గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న బొలెరో వాహనం-లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది స్పాటులో మృతి చెందారు. మరో డజనుకు పైగా గాయపడ్డారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

వెంటనే క్షతగాత్రులను అంబులెన్సులో ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

బొలెరో వాహనం- సిమెంట్ మిక్సర్ లారీ ఢీ.. స్పాట్‌లో 8 మంది మృతి

కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి బొలెరోలో బయలుదేరారు. మరో 10 నిమిషాలు మంత్రాలయం చేరుకుంటారని భావిస్తున్న సమయంలో ఈలోగా ప్రమాదానికి గురైంది. ఈలోగా ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ లారీ బొలెరోను బలంగా ఢీ కొట్టింది.

బొలెరోలోని డ్రైవర్ సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఘటన సమయంలో బొలెరోలో 23 మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ బాలిక ఉంది.  నిద్రమత్తు కారణమా? మరేదైనా కారణమా అనేది తెలియాల్సివుంది. మృతుల వివరాలు కూడా తెలియాల్సివుంది.

ALSO READ: విశాఖలో ఘోరం.. పార్టీ అని పిలిచి యువతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్!

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×