Coconut Water Safety Tips: ఎండలు మండిపోతున్నప్పుడు రోడ్డు పక్కన కొబ్బరి బొండాం కనిపిస్తే చాలు. ఒక్కటైనా తాగకుండా ఉండలేం. కొబ్బరి నీళ్లు కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, మన బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. అయితే.. ఇప్పుడు ఒక చిన్న అలవాటు ప్రాణాపాయానికి దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. బొండాం కొట్టించి, స్ట్రా వేసుకుని నేరుగా తాగడం వల్ల కొన్ని డేంజరస్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందట. నమ్మలేకపోతున్నారా ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
సాధారణంగా కొబ్బరి బొండాం లోపల నీళ్లు చాలా సురక్షితంగా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ.. కొన్నిసార్లు బొండాం పైన ఉండే చిన్న చిన్న పగుళ్ల ద్వారా లేదా వాటిని నిల్వ చేసే విధానం వల్ల ఫంగస్ లోపలికి చేరుతుంది. దీని వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
3-నిట్రోప్రోపియోనిక్ యాసిడ్ : కొన్ని రకాల ఫంగస్‌లు కొబ్బరి నీళ్లలో 3-NPA అనే శక్తివంతమైన టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఇది శరీరంలోకి చేరితే వాంతులు, విరేచనాలు మాత్రమే కాదు.. తీవ్రమైన సందర్భాల్లో నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
బ్యాక్టీరియా ముప్పు: కొబ్బరి బొండాం కొట్టే కత్తి శుభ్రంగా లేకపోయినా.. లేదా దాని పైభాగంలో దుమ్ము ఉన్నా, అవి నీటిలో కలిసే అవకాశం ఉంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
నిపుణులు ఏం చెబుతున్నారు?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నీళ్లను ఎప్పుడూ ఒక ట్రాన్స్‌పరెంట్ గ్లాసులోకి పోసుకుని తాగడం ఉత్తమం. ఎందుకుంటే..
రంగు: కొబ్బరి నీళ్లు ఎప్పుడూ క్లియర్‌గా ఉండాలి. ఒకవేళ నీరు కొంచెం పసుపు రంగులోనో లేదా మురికిగానో కనిపిస్తే అందులో ఫంగస్ ఉన్నట్లు అర్థం.
వాసన : లోపల ఫంగస్ ఉంటే నీళ్లు పుల్లటి వాసన లేదా వింత వాసన వస్తాయి. బొండాం నుంచి నేరుగా తాగినప్పుడు ఈ వాసనను మనం గుర్తుపట్టలేకపోవచ్చు.
గుజ్జు : ఒక్కోసారి లోపల కొబ్బరి గుజ్జు గులాబీ రంగులోకి మారుతుంది. ఇది బ్యాక్టీరియా ఎదుగుదలకు సంకేతం. గ్లాసులో పోస్తే.. ఇలాంటివి ఈజీగా కనిపిస్తాయి.
Also Read: ఎండ దెబ్బ నుంచి రక్షణ.. ఆయుర్వేదం ప్రకారం ఈ 6 పదార్థాలు తింటే శరీరం కూల్!
సురక్షితంగా తాగడం ఎలా?
1.బొండాం కొట్టే ముందు దాని పైభాగాన్ని శుభ్రంగా తుడవమని అడగండి.
2.నీటిని గ్లాసులో పోయించుకుని, అవి స్వచ్ఛంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే తాగండి.
3.ముందుగానే పగుళ్లు ఉన్న బొండాలను ఎంచుకోకండి.
4.చాలా సేపు ఎండలో ఉన్న బొండాల కంటే.. చల్లని ప్రదేశంలో ఉన్న వాటిని ఎంచుకోవడం మేలు.
5.కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ జాగ్రత్తలు పాటిస్తేనే అది పూర్తి సురక్షితం. ఒక నిమిషం ఓపిక పట్టి గ్లాసులో పోసుకుని తాగడం వల్ల పెద్ద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
Also Read: కిటికీ దగ్గర చెంచా ? వైరల్ అవుతున్న ఈ ట్రెండ్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!