E-Paper
Advertisement

కూతురి విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీరు ‘ఫ్లాప్’ తండ్రి కిందే లెక్క!

కూతురి విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీరు ‘ఫ్లాప్’ తండ్రి కిందే లెక్క!
Advertisement

Father Daughter: తండ్రి-కూతుళ్ల బంధం అంటేనే  ఒక ఎమోషన్…తండ్రి అంటే కూతురికి సూపర్ హీరో.. కూతురు అంటే తండ్రికి ప్రాణం. ఈ మాటలు వినడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాల మంది ప్రేమ పేరుతో  కట్టుబాట్లు విధించడం రక్షణ పేరుతో ఆమె కెరీర్‌ను తొక్కేయడం వంటివి చేస్తూ తమకు తెలియకుండానే ఆ బంధాన్ని చెడగొట్టుకుంటున్నారు.అందుకే కొన్ని వేల ఏళ్ల క్రితమే  చాణక్యుడు, కూతురి విషయంలో తండ్రి గీత దాటితే వచ్చే నష్టాల ఇలా చెప్పుకొచ్చాడు.మరవేంటో చూసేద్దామా..

అలా చేస్తే గనుక మీరే  శత్రువుతో సమానం

Advertisement

 చాలామంది తండ్రులు తమ కూతురు ఏం చదవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా , చివరకు ఏ రంగు బట్టలు వేసుకోవాలన్నా తామే డిసైడ్ చేస్తారు.ఇలా గనుక కూతురి నిర్ణయాల్లో ఓవర్ గా ఇంటర్ ఫియర్ అయితే ఆమెకు మీ మీద గౌరవం పోయి, తిరుగుబాటు మొదలవుతుంది.సలహాలు ఇవ్వండి, ఏది మంచో ఏది చెడో చెప్పండి.కానీ గొంతు మీద కత్తి పెట్టి మీ నిర్ణయాలను మాత్రం వారిపై రుద్దకండి.అలా చేస్తే గనుక ఆమె ఎదుగుదలకు మీరే  శత్రువుతో సమానం అని మర్చిపోకండి.

చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు బోలెడు

Advertisement

 ఇక మన సొసైటీలో కొడుకున్న ఇంపార్టెన్స్  కూతురికి ఉండదు. ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో కొడుకు ఏం చేసినా చెల్లుతుంది,అదే కూతురు చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు బోలెడు.సో..పిల్లల మధ్య వివక్ష చూపే తండ్రికి, కూతురి నుంచి ప్రేమను ఆశించే హక్కు లేదు.ఇక  కొడుకుతో సమానంగా కూతురిని గౌరవించని ఇల్లు అభివృద్ధి చెందిన దాఖలాలే లేవు.

పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుందా ..

 ఇక “అమ్మాయి కదా.. ఏదో ఒక డిగ్రీ చదివించి, పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది” అని భావించే తండ్రులు మన సమాజంలో చాలామందే ఉన్నారు. అలా కూతురికి చదువు ఎందుకని ఆలోచిస్తున్నారంటే ఒక తండ్రిగా ఆమె భవిష్యత్తును మీ చేతులతో మీరే నాశనం చేసినట్టు. బాగా చదువుకున్న మహిళకే ఒక కుటుంబాన్ని, సమాజాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆమెకున్న ఇష్టా ఇష్టాలని చంపేసి, కేవలం ‘వంట గది’కే పరిమితం చేయాలనుకోవడం పెద్ద  నేరం.

also read:Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్

ధైర్యంగా బతకడం నేర్పించండి.

ఇక కూతురి భద్రత తండ్రికి బాధ్యతే.. దాన్ని ఎవరూ కాదనలేరు. కాని ఆ పేరుతో అస్తమానం ఫోన్ చెక్ చేయడం, బయట ప్రపంచం బాలేదని ఇంట్లోనే ఉంచడం అసలు మంచిది కాదు. కుదిరితే ఆమెకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి.ధైర్యంగా బతకడం నేర్పించండి. మీరు గనక ఎప్పుడూ భయం నీడలో పెంచితే, రేపు ఒంటరిగా ప్రపంచాన్ని ఎలా ఎదుర్కొంటుందో ఒకసారి ఆలోచించండి.

ఓపిక లేని ఏ  తండ్రి కూతురికి దగ్గర కాలేడు

 ఇక  తండ్రి అంటే కేవలం స్కూల్ ఫీజులు కట్టేవాడో,అడిగింది కొనిచ్చేవాడో కాదు కూతురు మనసులో ఏముందో తెలుసుకునే వాడు. కూతురి మనసులోని మాట వినే ఓపిక లేని ఏ  తండ్రి కూతురికి దగ్గర కాలేడు.ఇకపోతే కూతురికి కావాల్సింది తండ్రి ఇచ్చే భరోసా. కష్టమొచ్చినప్పుడు తండ్రికి చెప్పుకోలేక బయట వ్యక్తులను నమ్మి మోసపోయే అమ్మాయిలెందరినో మనమూ చూస్తుంటాం కూడా.

కేవలం ఒక ‘ఏటీఎం మెషిన్’ లాగే మిగిలిపోవడం ఖాయం

 ఇప్పటికైనా కూతురు చెప్పేది వినండి. తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.అన్నింటి కంటే ముఖ్యంగా కూతురిని కేవలం ఒక బాధ్యతగా కాకుండా, ఒక ఇండిపెండెంట్ పర్సన్ గా గుర్తించండి.అలా కాకుండా కేవలం డబ్బులతోనే బాధ్యతని కొలిస్తే మాత్రం ఆమె జీవితంలో కేవలం ఒక ‘ఏటీఎం మెషిన్’ లాగే మిగిలిపోవడం ఖాయం !

also read:AR Murugadoss controversy: 60 కోట్ల కాంట్రవర్సీ… ‘ఠాగూర్’ సీక్వెల్‌తో సెటిల్‌మెంట్?

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×