E-Paper
Advertisement

Navadeep : సినిమాలకు హీరో గుడ్ బై.. అసలేం జరిగిందంటే..?

Navadeep : సినిమాలకు హీరో గుడ్ బై.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Navadeep : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోలలో నవదీప్ ఒకరు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఈమధ్య ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. దాంతో వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాయి హీరోకు అక్కడ కూడా పెద్దగా ఆదరణ లభించలేదు. ఇక నవదీప్ హీరోగా భారీ అంచనాలతో నటించిన చిత్రం లవ్‌ మౌళి.. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌ గా నిలిచింది.. ఆ సినిమా ఫలితం గురించి దాదాపు ఏడాది తర్వాత హీరో స్పందించారు.. ప్రస్తుతం ఈయన దండోరా సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.. నవదీప్ నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా? అన్నది ఒకసారి తెలుసుకుందాం..

లవ్ మౌళి పై నవదీప్ షాకింగ్ కామెంట్స్…

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవదీప్ మాట్లాడుతూ.. సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో నన్ను బాగా కుంగతీసింది. చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం.. కానీ ఈ సినిమా మా కష్టాన్ని గుర్తించలేకపోయింది. దారుణంగా కలెక్షన్స్ కూడా రావడంతో మేము చాలా బాధపడ్డాము అని నవదీప్ అన్నారు. విడుదల తర్వాత వచ్చిన టాక్‌తో నిరాశ చెందాను. దానిని తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో చాలా బాధాకరమైన అనుభవంగా సినిమా మిగిలిపోయిందని ఆయన అన్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాను. నా సోదరి ఇంట్లో దాదాపు మూడు నెలలు ఉన్నాను.. సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేద్దామని దాదాపు ఫిక్స్ అయిపోయాను అని నవదీప్ అన్నారు. కొంతకాలం తర్వాత మళ్లీ దండోరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను అని ఆయన అన్నారు.

Advertisement

Also Read :గాయత్రిని ఆడుకున్న చక్రి.. డ్రైవర్ గా జాయిన్ అయిన చక్రి..మహా మాటతో హారిక షాక్..

బిగ్ బాస్ తర్వాత నవదీప్ ఇమేజ్ తగ్గిందా..? 

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ రియాల్టీ షో లలో పాల్గొంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.. ఆ మధ్య బిగ్ బాస్ లోకి వెళ్లిన ఆయన తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ విన్నర్ గా నిలవలేకపోయాడు.. అయితే బిగ్ బాస్ గురించి అనేకసార్లు ఆయన ప్రస్తావించారు.. ఇక దీనిపై సోషల్ మీడియాలో కూడా అనేక వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఆయన బాగానే సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత ఇమేజ్ డౌన్ అయింది అని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా నడిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై నవదీప్ స్పందించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పొడి చేస్తామని వెళ్తాము కానీ ఏమీ ఉండదు.. అందరికీ క్రేజ్ పెరుగుతుంది మరికొందరు ఉన్న వాటిని కాపాడుకోవాలని చూస్తారు. అంతే తప్ప బిగ్ బాస్ కి వెళ్తే పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అని నవదీప్ అన్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఇకపోతే దండోరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు నవదీప్. ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×